హైదరాబాద్: ఈ నెల 27వ తేదీన ఇంటర్ ఫలితాలను విడుదల చేయాలని హైకోర్టు  తెలంగాణ ఇంటర్ బోర్డును ఆదేశించింది.ఇంటర్ జవాబు పత్రాలను రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌ను పూర్తి చేసినట్టుగా ఇంటర్ బోర్డు బుధవారం నాడు హైకోర్టుకు తెలిపింది.

ఇంటర్ ఫలితాలపై బుధవారం నాడు హైకోర్టు విచారణ చేసింది. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ పూర్తి చేసినందున రేపు ఫలితాలను ప్రకటిస్తామని ఇంటర్ బోర్డు కోర్టుకు తెలిపింది. అయితే ఈ నెల 27వ తేదీన ఫలితాలను విడుదల చేయాలని హైకోర్టు ఇంటర్ బోర్డును ఆదేశించింది.

ఈ నెల 27వ తేదీన ఇంటర్ ఫలితాలతో పాటు సమాధాన పత్రాలను కూడ వెబ్‌సైట్‌లో ఉంచాలని  హైకోర్టు ఆదేశించింది. మరో వైపు ఈ  కేసులో గ్లోబరినా సంస్థకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఈ ఏడాది జూన్ 6వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.