Asianet News TeluguAsianet News Telugu

మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఆపే ప్రసక్తే లేదు: హైకోర్టు

మల్లన్నసాగర్ ప్రాజెక్టును ఆపే ప్రసక్తే లేదని తెలంగాణ హైకోర్టు  తేల్చి చెప్పింది. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితుల పిటిషన్‌పై గురువారం నాడు  విచారించింది. 
 

High court not interested to stay on mallanna sagar project
Author
Hyderabad, First Published May 16, 2019, 4:54 PM IST

హైదరాబాద్: మల్లన్నసాగర్ ప్రాజెక్టును ఆపే ప్రసక్తే లేదని తెలంగాణ హైకోర్టు  తేల్చి చెప్పింది. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితుల పిటిషన్‌పై గురువారం నాడు  విచారించింది. 

కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహన్  నేతృత్వంలోని వేసవి సెలవుల ప్రత్యేక ధర్మాసనం ప్రకటించింది.

కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుబంధ ప్రాజెక్టులకు సంబంధించి హైకోర్టులో 175కు పైగా పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. వీటన్నింటిని కలిపి విచారించాలంటూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం హైకోర్టులో మధ్యంతర ధరఖాస్తు చేసుకొన్న విషయం తెలిసిందే.

ఈ ప్రాజెక్టు పరిధిలో 47 ఎకరాలకు చెందిన నిర్వాసితులు మాత్రమే పరిహరం తీసుకొనేందుకు నిరాకరించారని కోర్టుకు న్యాయవాది తెలిపారు. పరిహారం చెల్లింపులో అన్యాయం జరిగితే తమ వద్దకు రావాలని హైకోర్టు తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios