తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్‌‌ను పంజాబ్-హర్యానా హైకోర్టుకు బదిలీ చేయడంపై న్యాయవాదులు భగ్గుమన్నారు. హైకోర్టు న్యాయవాదులు మంగళవారం విధులు బహిష్కరించగా.. శనివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టులను న్యాయవాదులు బహిష్కరించాలని బార్ అసోసియేషన్ పిలుపునిచ్చింది.

ఇక్కడ సీనియర్ జడ్జిగా వున్న వ్యక్తిని జూనియర్ జడ్జిగా పంపటంపై లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. జస్టిస్ సంజయ్ కుమార్‌ను వెంటనే తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. అలాగే హైకోర్టు బిల్డింగ్‌ను తరలించే ఆలోచనను సైతం విరమించుకోవాలని హైకోర్టు పరిరక్షణ సమితి కోరింది.