Asianet News TeluguAsianet News Telugu

సునీల్ కనుగోలు ఆఫీసులో సోదాలు.. కాంగ్రెస్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ.. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశం

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు నిర్వహిస్తున్న కార్యాలయంపై పోలీసుల సోదాలపై తెలంగాణ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది.

High court hearing telangana congress petition over sunil Kanugolu War room
Author
First Published Dec 15, 2022, 1:36 PM IST

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు నిర్వహిస్తున్న కార్యాలయంపై పోలీసుల సోదాలపై తెలంగాణ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. పోలీసుల అదుపులో ఉన్న సునీల్ కనుగోలు టీమ్‌ సభ్యులను వెంటనే వదిలిపెట్టాలని కాంగ్రెస్ పిటిషన్‌లో పేర్కొంది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా.. పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కాంగ్రెస్ సోషల్ మీడియా వార్ రూమ్ నుంచి ముగ్గురిని పోలీసులు తీసుకెళ్లారని కాంగ్రెస్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. 18 గంటల పాటు వారిని అక్రమంగా నిర్బంధించారని చెప్పారు. 

అయితే తమకు అందిన ఫిర్యాదు మేరకు వారిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. నవంబర్ 24న ఎఫ్ఐఆర్ నమోదుచేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురికి 41ఏ నోటీసులు ఇచ్చి వదిలిపెట్టినట్లు చెప్పారు. అయితే ముగ్గురిని అక్రమంగా అదుపులోకి తీసుకున్నందున ఒక్కొక్కరికి రూ. 20 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు. ఈ క్రమంలోనే హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. 

ఇక, సునీల్ కనుగోలు నిర్వహిస్తున్న కార్యాలయంపై సోదాలకు సంబంధించిన వివరాలను పోలీసులు బుధవారం మీడియాకు వెల్లడించారు. సీసీఎస్ సైబర్ క్రైమ్ జాయింట్ సీపీ గజరావ్ భూపాల్ మాట్లాడుతూ.. మహిళలను కించపరిచేలా పోస్టులు పెడుతున్నారంటూ ఫిర్యాదు రావడంతో సోదాలు జరిపినట్టుగా చెప్పారు. ఫేక్ ఐడీలతో పోస్టులు పెడుతున్నారని.. టెక్నాలజీ సాయంతో లోకేషన్‌ను కనుక్కున్నామని చెప్పారు. మహిళల విషయంలో అసభ్యంగా ఎవరూ పెట్టినా చర్యలు తప్పవని తెలిపారు. మహిళలను కించపరచడాన్ని వ్యంగ్యం అని పేర్కొనలేమని  చెప్పారు. 

ఇందుకు సంబంధించి లీగల్‌గా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం జరిగిందన్నారు. సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌లో ఒక కేసు.. మిలిగిన పోలీసు స్టేషన్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయని అన్నారు. మంగళవారం ముగ్గురిని కస్టడీలోకి తీసుకుని.. 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చిన పంపించడం జరిగిందన్నారు. 10 ల్యాప్‌ ట్యాప్స్, మొబైల్ ఫోన్స్‌ను సీజ్ చేసినట్టుగా చెప్పారు. చట్టప్రకారమే తాము వ్యవహరిస్తున్నామని చెప్పారు. 

అయితే చాలా రహస్యంగా ఈ ఆఫీసును నిర్వహిస్తున్నారని చెప్పారు. తాము అదుపులోకి తీసుకున్న ముగ్గురు కూడా ఈ ఆఫీసు సునీల్ కనుగోలు కింద వీళ్లు పనిచేస్తున్నట్టుగా తెలుస్తోందని చెప్పారు. వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ కేసులో సునీల్ కనుగోలును ప్రధాన నిందితుడు అవ్వనున్నట్టుగా చెప్పారు. ఈ కేసులో నోటీసులు మాత్రమే ఇచ్చామని.. ఇంకా ఎవరిని అరెస్ట్ చేయలేదని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios