పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అక్రమాలు చోటు చేసుకొన్నాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నేత నాగం జనార్ధన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను సోమవారం నాడు హైకోర్టు కొట్టివేసింది.


హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అక్రమాలు చోటు చేసుకొన్నాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నేత నాగం జనార్ధన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను సోమవారం నాడు హైకోర్టు కొట్టివేసింది.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అక్రమాలు చోటు చేసుకొన్నాయని నాగం జనార్ధన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు పుల్ బెంచ్ కొట్టేసింది. సరైన సాక్ష్యాలను కోర్టుకు నాగం జనార్ధన్ రెడ్డి సమర్పించలేదని కోర్టు అభిప్రాయపడింది. 

ప్రాజెక్టులో అన్నీ కూడ సక్రమంగానే ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. ఈ ప్రాజెక్టులో 2400 కోట్ల అవినీతి జరిగిందని నాగం ఆరోపించారు. పంప్‌హౌజ్‌లో బిగించిన మోటార్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరను వేశారని నాగం ఆ పిటిషన్‌లో ఆరోపించారు. 

72 గంటల్లో టెండర్లలోను ఫైనల్ చేశారని ఆ పిటిషన్‌లో నాగం చెప్పారు.ఇతర కాంట్రాక్టర్లకు నోటీసులు ఇవ్వకుండానే ఏకపక్షంగానే టెండర్లను ఫైనల్ చేశారని నాగం ఆరోపించారు. అయితే తన ఆరోపణలకు బలం చేకూర్చే సాక్ష్యాలను నాగం జనార్ధన్ రెడ్డి సమర్పించలేదని కోర్టు అభిప్రాయపడింది.