Asianet News TeluguAsianet News Telugu

పోడు భూముల వివాదం.. జీవో నెం. 140పై తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు కీలక ఆదేశాలు

పోడు భూములపై దాఖలైన జీవో నెం 140ని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ర్వాతి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి సమావేశాలు నిర్వహించొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

high court direct to telangana govt on go no 140
Author
First Published Sep 23, 2022, 2:15 PM IST

పోడు భూములపై జీవో 140ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనికి కౌంటర్ దాఖలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. జీవోలో ఎమ్మెల్యే , ఎంపీలు, జిల్లా మంత్రులు, ఎమ్మెల్సీలతో కమిటీ ఏర్పాటు చేసింది. అయితే తర్వాతి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి సమావేశాలు నిర్వహించొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో చట్ట పరిధిలో లేదని వ్యాఖ్యానించింది హైకోర్టు. అనంతరం విచారణను అక్టోబర్ 21కి వాయిదా వేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

కాగా.. పోడు భూములపై హక్కులను ధ్రువీకరించేందుకు ఏర్పాటు చేసే కమిటీల్లో  రాజకీయా పార్టీల నాయకులకు స్థానం కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన తేజావత్ శంకర్ సహా ముగ్గురు హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios