రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడంపై టీ.కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. 

రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడంపై టీ.కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఏపీలో విలీనమైన ఈ మండలాల నియోజకవర్గాలను పునర్విభజన చేయాలని శశిధర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ నేతృత్వంలో ధర్మాసనం ఎదుట వాదనలు జరిగాయి. భద్రాచలం డివిజన్ పరిధిలోని ఏడు మండలాలకు చెందిన మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగకుండానే ఎన్నికలు నిర్వహించడం.. రాజ్యంగ విరుద్ధమని శశిధర్ రెడ్డి ఆరోపించారు.

అయితే ఏడు మండలాలను ఏపీలో విలీనం చేస్తూ రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేశారని.. దీని ఆధారంగా ఓటర్లను కూడా ఆంధ్రప్రదేశ్‌కే బదిలీ చేసినట్లని ఎన్నికల సంఘం న్యాయస్ధానానికి తెలిపింది. ఇరపక్షాల వాదనలు విన్న హైకోర్టు శశిధర్ రెడ్డి పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది.