తెలంగాణలో టీచర్ల బదిలీలకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్
బదిలీలకు సంబంధించి ఉపాధ్యాయులకు తీపికబురు చెప్పింది తెలంగాణ హైకోర్ట్. టీచర్ల బదిలీలకు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మధ్యంతర స్టే ఉత్తర్వులను ధర్మాసనం సవరించింది.
బదిలీలకు సంబంధించి ఉపాధ్యాయులకు తీపికబురు చెప్పింది తెలంగాణ హైకోర్ట్. టీచర్ల బదిలీలకు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మధ్యంతర స్టే ఉత్తర్వులను ధర్మాసనం సవరించింది. టీచర్ల యూనియన్ల నేతలకు పది అదనపు పాయింట్లను తప్పబట్టింది హైకోర్ట్. టీచర్ల దంపతులకు అదనపు పాయింట్లు కేటాయింపునకు అనుమతి మంజూరు చేసింది. భార్యాభర్తలు కలిసి వుండాలన్నది నిబంధన ఉద్దేశమని ధర్మాసనం పేర్కొంది.