Asianet News TeluguAsianet News Telugu

ఆంధ్రాలో మావోల కాల్పులు: తెలంగాణలో హైఅలర్ట్

ఆంధ్రప్రదేశ్ విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తో పాటు మాజీ ఎమ్మెల్యే సోమును ఆదివారం అత్యంత దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన ఏపిలోనే కాదు తెలంగాణలోనూ కలకలం రేపింది. ఈ ఘటనతో అప్రమత్తమైన తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి పోలీసులతో అత్యవసర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

high alert in telangana
Author
Telangana, First Published Sep 24, 2018, 2:55 PM IST

ఆంధ్రప్రదేశ్ విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తో పాటు మాజీ ఎమ్మెల్యే సోమును ఆదివారం అత్యంత దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన ఏపిలోనే కాదు తెలంగాణలోనూ కలకలం రేపింది. ఈ ఘటనతో అప్రమత్తమైన తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి పోలీసులతో అత్యవసర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఏపిలో మావోలు ఏకంగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలపై దారుణంగా కాల్పులు జరిపి హతమార్చడంతో ఏపితో పాటు తెలంగాణలోను పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి ఇంటెలిజెన్స్ అధికారులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. తెలంగాణలో మావోయిస్టుల కదలికలపై, ప్రభావిత జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా డిజిపి అధికారులను ఆదేశించారు. అవసరమైతే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు అదనపు బలగాలను తరలించాల్సిందిగా డిజిపి అధికారులకు సూచించారు.

అంతేకాదు జిల్లా ఎస్పీలకు కూడా అప్రమత్తంగా ఉండాలని మహేందర్ రెడ్డి సూచించారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాలు ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ వంటి జిల్లాల్లో తాజా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులకు కట్టుదిట్టమైన రక్షణ కల్పించాలని ఎస్పీలను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు కూడా మారుమూల ప్రాంతాలకు వెళ్లెటపుడు ఎస్పీ, డీఎస్పీలకు ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలని డిజిపి కోరారు.  
 
Follow Us:
Download App:
  • android
  • ios