Asianet News TeluguAsianet News Telugu

హెరిటేజ్ ను వదిలించుకున్న బాబు

  • 124 స్టోర్లను సొంతం చేసుకున్న ఫ్యూచర్ గ్రూప్
heritage

ఏపీ ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడు కుటుంబానికి చెందిన రిటైల్ గ్రూప్ సంస్థ హెరిటేజ్ ను దేశంలోని అతిపెద్ద రిటైల్ గ్రూప్ సంస్థ  ఫ్యూచర్ గ్రూప్ సొంతం చేసుకుంది. హెరిటేజ్ ఫుడ్స్కు చెందిన రిటైల్ డివిజన్‌ను కొనుగోలు చేసింది.  హెరిటేజ్ ఫుడ్స్ కు చెందిన  124 స్టోర్లను ఫ్యూచర్ గ్రూప్ నకు అప్పగించింది. ఇకపై హెరిటేజ్ స్టోర్లు ఫ్యూచర్ గ్రూప్లో భాగంగా ఉంటాయి. దీనికి బదులుగా ఫ్యూచర్ గ్రూప్ సంస్థ తన షేర్లలోని 3.5 శాతం వాటాను హెరిటేజ్ గ్రూప్ కు  ఇవ్వనుంది.

ఫ్యూచర్ గ్రూప్ సంస్థ ఇప్పటికే బిగ్ బజార్, ఈ-జోన్, షాపర్స్ స్టాప్ వంటి బ్రాండ్లతో రిటైల్ రంగంలో దూసుకెళ్తుంది. బిగ్‌బజార్, ఫుడ్ బజార్ పేర్లతో దేశవ్యాప్తంగా 738 స్టోర్స్‌ను కలిగి వున్న కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూపు వ్యాపార విస్తరణపై దృష్టిసారిస్తోంది. 24 ఏళ్ల కిందట ప్రారంభమైన హెరిటేజ్ సంస్థలో చంద్రబాబునాయుడు శ్రీమతి భువనేశ్వరీ దేవికి 22.98 శాతం, లోకేష్ నాయుడికి 10.2, కోడలు బ్రాహ్మణికి 0.44 శాతం, చంద్రబాబునాయుడు వియ్యుంకుడుకి 0.3 శాతం, ప్రమోటర్లకు 39.9 శాతం భాగస్వామ్యాలున్నాయి.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios