Russia Ukraine Crisis:  తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలంగాణా విద్యార్థులకు తగు సహాయం అందించేందుకు న్యూ ఢిల్లీ తోపాటు తెలంగాణ సెక్రెటేరియట్ లలో ప్రత్యేక హెల్ప్ లైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. 

Russia Ukraine Crisis: రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం తీవ్రమైంది. అక్క‌డ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అందరినీ కలవరపెడుతున్నాయి. ఉక్రెయిన్‌లో దాదాపు 20 వేల మంది భారతీయులు ఉన్నారని తేల్చిన కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఇప్పటికే 4 వేల మంది వరకు భారత్‌కు తిరిగి వచ్చినట్టు ప్రకటించింది. దాదాపు 16 వేల మంది భారతీయులు ఉక్రెయిన్ లో చిక్కున్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాల‌కు చెందిన విద్యార్థులు కూడా వంద‌లాది మంది ఉక్రెయిన్ లో ఉండిపోయారు. వారి ర‌క్షించేందుకు కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తు్న్నాయి.

అక్కడున్న తెలుగువారిని సురక్షితంగా తీసుక‌రావ‌డం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌కు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తెలంగాణ విద్యార్థుల భద్రత కోసం తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఉక్రెయిల్‌లో ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని.. తనకు సందేశాలు పంపిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.

ఈక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులకు తగు సహాయం అందించేందుకు ఢిల్లీలోని తెలంగాణ భవన్, రాష్ట్ర సెక్రటేరియట్‌ కార్యాలయంలో హెల్ప్ లైన్లను ఏర్పాటు చేశారు. ఈ స‌మాచారాన్ని ఓ ప్ర‌క‌ట‌న ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్ వెల్లడించారు.

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు, ఈ-మెయిల్ ఐడీలు.. సెక్రెటరేట్‌లో సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు, ఈ-మెయిల్ ఐడీల వివరాలను సీఎస్‌ సోమేష్ కుమార్ ప్రకటించారు.

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో..

విక్రమ్​సింగ్​మాన్: +91 7042566955

చక్రవర్తి పీఆర్‌వో: +91 9949351270

నితిన్ వోఎస్డీ : +91 9654663661

ఈమెయిల్ ఐడీ : rctelangana@gmail.com

తెలంగాణ సచివాలయం -హైదరాబాద్

చిట్టిబాబు ఏఎస్‌వో: 040-23220603, +91 9440854433

ఈ-మెయిల్ ఐడీ : e-mail nri@telengana.gov.in లను సంప్రదించాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ సూచించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం కూడా ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వారికోసం హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. 


నోడల్ అధికారి రవి శంకర్ - 9871999055 

రిటైర్డ్ ఐఎఫ్‌ఎస్‌ గీతేష్ శర్మ - 7531904820 

ఏపీ ఎన్ఆర్‌టీ సీఈఓ దినేష్ కుమార్ - 9848460046

 కాగా ఉక్రెయిన్ నుంచి తెలంగాణాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 32 మంది విద్యార్థులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకున్న విద్యార్థులను చూసిన తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.