హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు సెలవులను ప్రకటించింది ప్రభుత్వం.గత మూడు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది.

స్కూళ్లు, కాలేజీల ఆన్ లైన్ క్లాసులను కూడ ప్రభుత్వం రద్దు చేసింది. ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురవడంతో హైద్రాబాద్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సుమారు 32 సెం.మీ వర్షపాతం నమోదైంది. దీంతో  నగరంలోని పలు కాలనీలు నీట మునిగిపోయాయి. చాలా కాలనీల్లో  విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 

పలు కాలనీలు నీటమునిగిపోయాయి. పలు అపార్ట్ మెంట్లలో  నీరు వచ్చి చేరింది. రోడ్లపై వరద నీరు  ఉధృతంగా ప్రవహిస్తోంది.

హైద్రాబాాద్ కు రెడ్ అలెర్ట్ వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షంతో పెద్ద ఎత్తున జన జీవనం అతలాకుతలమైంది. ఎక్కడ చూసినా నీటితో మునిగిపోయింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు సహాయక చర్యలను చేపట్టారు.