హైదరాబాద్‌లో మరోసారి  వర్షం దంచికొడుతుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. 

హైదరాబాద్‌లో మరోసారి వర్షం దంచికొడుతుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌బీ నగర్, సరూర్‌నగర్‌, ఉప్పల్‌, ఘట్‌కేసర్‌, పీర్జాదిగూడ, వనస్థలిపురం, కాప్రా, దమ్మాయిగూడ, నాగోల్‌, ఓయూ, మీర్‌పేట్, చంపాపేట్, రామంతాపూర్‌, అంబర్‌పేట్‌లో వర్షం కురుస్తోంది. ఈదురు గాలులు కూడా వీస్తున్నాయి. వర్షానికి పలుచోట్ల చెట్లు నెలకొరిగాయి. కొన్నిచోట్ల రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచింది. దీంతో ఆ మార్గాల్లో ట్రాఫిక్‌ జామ్ అవుతుంది. అయితే ఉదయం నుంచి ఎండ, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న నగరవాసులకు వర్షంతో ఉపశమనం లభించినట్లయింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Scroll to load tweet…