తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాదులోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈ రోజు సోమవారం మధ్యాహ్నం వరకు వేడి, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడి పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.
హైదరాబాదులోని నాంబల్లి, ఆబిడ్స్, లక్డి కాపూల్, బంజారాహిల్స్, జూబ్లి హిల్స్, ఫిల్మ్ నగర్ లో భారీ వర్షం పడింది. అదే విధంగా ప్రగతినగర్, నిజాంపేట, బాచుపల్లి ప్రాంతాల్లోనూ వర్షాలు పడ్డాయి.
తెలంగాణలో వాతావరణం చల్లబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ వాతావరణం చల్లబడింది. వచ్చే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి.
హైదరాబాదులో ఉరుమలు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. హైదరాబాదులో మబ్బులు కమ్మి చీకటి అలుముకుంది.
