Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ కాళ్లు మొక్కిన డీహెచ్ శ్రీనివాసరావు.. టీఆర్ఎస్ టికెట్ కోసమేనన్న మాజీ ఐఏఎస్..

లంగాణ వైద్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లు మొక్కడంపై పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ కోసమే ఆయన ఇలా చేశారని సోషల్ మీడియాలో పలువురు కామెంట్స్ చేస్తున్నారు. 

Health Director Srinivasa Rao Touches CM KCR Feet
Author
First Published Nov 16, 2022, 2:04 PM IST

తెలంగాణ వైద్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లు మొక్కడంపై పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది మెడికల్ కాలేజీలను మంగళవారం ప్రగతి భవన్‌ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, రామగుండంలో ఈ ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. ఈ కాలేజీలన్నింటిలో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం తరగతులు మంగళవారం నుంచి ప్రారంభం అయ్యాయి. 

ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన డీహెచ్ శ్రీనివాసరావు కేసీఆర్‌కు పుష్పగుచ్చం ఇచ్చారు. కొన్ని సెకన్ల పాటు కేసీఆర్‌తో మాట్లాడి.. ఆయన కాళ్లకు నమస్కారం చేశారు.  కార్యక్రమం పూర్తైన తర్వాత కేసీఆర్ అక్కడి నుంచి వెళ్తున్న సమయంలో  కూడా ఆయన కాళ్లకు డీహెచ్ శ్రీనివాసరావు నమస్కారం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు వచ్చే అసెంబ్లీ  ఎన్నికల్లో టికెట్ కోసమే ఆయన ఇలా చేశారని సోషల్ మీడియాలో పలువురు కామెంట్స్ చేస్తున్నారు. 

 


ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి.. టీఆర్ఎస్ టికెట్ కోసమే శ్రీనివాసరావు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నారని ఆరోపించారు. ‘‘కొత్తగూడెం అసెంబ్లీ టీఆర్ఎస్ టికెట్ గురించే కదా డాక్టర్ శ్రీనివాస్ సీఎం కాళ్ళు పట్టుకోడం. మీలాంటి అధికారులు బ్యూరోక్రసీ పరువు తీస్తున్నారు. మొన్న కొత్తగూడెం వెళ్ళినప్పుడు చూసా టౌన్ నిండా మీ ఫ్లెక్సీలే. పదవి మిస్ యూజ్ చేస్తూ కొత్తగూడెంలో ఎదో కార్యక్రమాలు చేస్తున్నారని కొందరు నాతో అన్నారు.వీడియో’’ అని ఆకునూరి మురళి ట్వీట్ చేశారు. ఇక, ఇటీవలి కాలంలో డీహెచ్ శ్రీనివాసరావు వివాదాలకు కేంద్ర బిందువుగా మారడం పరిపాటిగా మారింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios