ఖమ్మం: ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో డెలీవరీ చేస్తున్న సమయంలో  వీడియో తీసిన ఘటన కలకలం రేపుతోంది.ఈ వీడియో‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఓ మహిళ ప్రసవం కోసం చేరింది. ఈ మహిళకు డెలీవరీ చేసే సమయంలో హెడ్ నర్స్ వీడియో తీసింది.  ఈ వీడియోను వాట్సాప్‌లో షేర్ చేసింది.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండ్ స్పందించారు.ఆసుపత్రిలో ఈ రకంగా వీడియోలు తీసినవారు ఎవరైనా చర్యలు తీసుకొంటామన్నారు. మరో వైపు ఈ విషయమై జిల్లా కలెక్టర్‌తో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు.