ఫోన్ పే కష్టమర్ కేర్ నెంబర్ కు కాల్ చేసి మనీ ఎందుకు కట్ అయ్యాయో తెలుసుకుందామని ఆ యువకుడు చేసిన ప్రయత్నం చివరికి అతడిని మోసగాళ్ల వలలో పడేలా చేసింది. ఆ కాల్ సెంటర్ వాళ్లు చెప్పినట్టు చేయడంతో అకౌంట్ల ఉన్న డబ్బులు కట్ అయ్యాయి.
హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడి మొబైల్ లో ఉన్న యూపీఐ మనీ పేమెంట్స్ యాప్ లో డబ్బులు కట్ అయ్యాయి. దీంతో ఏం చేయాలో తెలియక, ఈ విషయంలో ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలో తెలియక కష్టమర్ కేర్‌కు కాల్ చేద్దామనుకున్నాడు. అతడి దగ్గర కష్టమర్ కేర్ నెంబర్ లేకపోవడంతో నెట్ లో సెర్చ్ చేశాడు. అందులో ఫోన్ పే కష్టమర్ కేర్ అని ఒక నెంబర్ కనిపించింది. దానికి వెంటనే కాల్ చేశాడు. వారు చెప్పినట్టు చేశాడు. చివరికి తన అకౌంట్లో ఉన్న డబ్బు కూడా పోయిందని నిర్ధారించుకొని ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఏం చేయాలో తెలియక లబోదిబోమంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. నెట్ లో ఫోన్ పే కష్టమర్ కాల్ సెంటర్ కోసం సెర్చ్ చేసి మోసగాళ్ల వలలో పడ్డాడు ఆ యువకుడు. తాను ఏ అకౌంట్‌కు మనీ ట్రాన్స్‌ఫర్ చేయలేదని, అయినా మనీ ఎలా కట్ అయ్యాయని ప్రశ్నించాడు. మీ డబ్బులు ఎక్కడికీ పోవని, తాము చెప్పినట్టు చేస్తే మీ అకౌంట్‌లో తిరిగి క్రెడిట్ అవుతాయని అవతల వ్యక్తి సున్నితంగా మాట్లాడి నమ్మించాడు. దీంతో నమ్మిన యువకుడు వారు చెప్పిన విధంగా చేయడం ప్రారంభించాడు. అవతల వ్యక్తి అడిగిన వివరాలు అన్నీ ఇచ్చేశాడు. కాల్ కట్ అయిన తరువాత చూసుకునే సరికి తన అకౌంట్లో ఉన్న మనీలో నుంచి రూ.1.72 లక్షలు పోగొట్టుకున్నానని గుర్తించాడు. పోయిన డబ్బుల కోసం ప్రయత్నిస్తే ఉన్నవి కూడా పోయాయని లబోదిబోమన్నాడు. ఏం చేయాలో తెలియక చివరికి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఒమిక్రాన్‌పై ఆందోళన వద్దు, అప్రమత్తంగా ఉన్నాం: మంత్రి హరీష్ రావు
లోన్ మంజూరైందని..
లోను వచ్చిందని కాల్ చేసి 2.70 లక్షలు కొల్లగొట్టిన మరో ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. దీనిపై సైబర్ క్రైం పోలీసులకు మంగళవారం ఫిర్యాదు అందింది. ఒక ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నానని ఓ వ్యక్తి సదరు యువకుడికి కాల్ చేశాడు. డబ్బులు అసవరం ఉన్న ఆ యువకుడు చాలా సంతోషపడిపోయాడు. లోన్ మీ అకౌంట్‌కు రావాలంటే కొంత ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుందని కాల్ చేసిన వ్యక్తి చెప్పాడు. అలాగే చేస్తానని ఆ యువకుడు బదులిచ్చాడు. లోన్ కోసం కొన్ని డాక్యుమెంట్లు ఇవ్వాల్సి ఉంటుందని, దాని కోసం కొన్ని డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పడంతో యువకుడు నమ్మి డబ్బులు పంపించాడు. ఇలా పలు మార్లు కాల్ చేసి కొంత డబ్బులు అడిగేవాడు. లోన్ వస్తుందనే ఆశతో యువకుడు డబ్బులు పంపించేవాడు. ఇలా ఇప్పటి వరకు 2.70 లక్షల వరకు అతడికి అందజేసినా లోన్ రాకపోవడంతో ఆ యువకుడు మోసపోయానని గ్రహించాడు. లోన్ ఏమైందని మళ్లీ కాల్ చేస్తే ఇంకా డబ్బులు కావాలని మళ్లీ అడిగాడు. లోన్ కోసం ప్రయత్నించి, తన వద్ద ఉన్న డబ్బులు పోగొట్టుకున్నానని ఆ యువకుడు తెలుసుకున్నాడు. ఏం చేయాలో తెలియక చివరికి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. అతడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ వినయ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
