Asianet News TeluguAsianet News Telugu

నౌరాషేక్‌కు బెయిల్.. పూచీకత్తు రూ.5 కోట్లు

అధిక వడ్డీలు ఆశ చూపి ప్రజల వద్ద నుంచి భారీగా డిపాజిట్లు వసూలు చేసి బోర్డ్ తిప్పేసిన హీరా గ్రూప్ ఛైర్మన్ షేక్ నౌహీరాకు బెయిల్ లభించింది. బెయిల్ కోసం ఆమె వేసిన పిటిషన్‌ను విచారించిన నాంపల్లి కోర్టు బుధవారం ఇరుపక్షాల వాదనలు వినింది

He era Group founder Nowhera Shaikh granted Rs 5 crore bail
Author
Hyderabad, First Published Oct 25, 2018, 8:04 AM IST

అధిక వడ్డీలు ఆశ చూపి ప్రజల వద్ద నుంచి భారీగా డిపాజిట్లు వసూలు చేసి బోర్డ్ తిప్పేసిన హీరా గ్రూప్ ఛైర్మన్ షేక్ నౌహీరాకు బెయిల్ లభించింది. బెయిల్ కోసం ఆమె వేసిన పిటిషన్‌ను విచారించిన నాంపల్లి కోర్టు బుధవారం ఇరుపక్షాల వాదనలు వినింది.

అనంతరం ఆమెకు షరతులో కూడిన బెయిల్ మంజూరు చేసింది.. పూచీకత్తుగా న్యాయస్థానానికి రూ .5 కోట్లు డిపాజిట్ చేయడంతో పాటు దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు గానూ పాస్‌పోర్ట్‌ను కూడా తమకు సమర్పించాలని ఆదేశించింది.

అంతకు ముందు నౌహీరాను తమ కస్టడీకి అప్పగించాలంటూ సీసీఎస్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందిస్తూ.. ఈ కేసు విషయంలో రాష్ట్ర పోలీసులు ఎందుకంత ఉత్సాహం చూపుతున్నారని ప్రశ్నించింది. ఈ కేసును ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థకు బదిలీ చేయాలని సూచించింది.

అలాగే వైసీపీ అధినేత వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుతో పాటు నగదు బదిలీ అవకతవకల విషయాన్ని ప్రాసిక్యూషన్ న్యాయస్థానికి తెలిపింది. అయితే నౌహీరా ఆధ్వర్యంలోని కంపెనీలు .. జాతి భద్రతకు విఘాతం కలిగిస్తున్న కొన్ని అతివాద సంస్థలకు నిధులను సమకూరుస్తున్నట్లుగా తెలిపింది.

వీటన్నింటిని పరిశీలించిన న్యాయస్థానం సీసీఎస్ కస్టడీ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ నౌహీరాకు బెయిల్ మంజూరు చేసింది. అలాగే అక్టోబర్ 27 నుంచి అక్టోబర్ 31 తేదీల్లో పోలీసుల విచారణకు హాజరవ్వాలని... అక్టోబర్ 29 లోపు పూచీకత్తు సొమ్మును చెల్లించాలని.. తమ అనుమతి లేకుండా హైదరాబాద్‌ను దాటి వెళ్లరాదని న్యాయస్థానం.. నౌహీరాను ఆదేశించింది.

తెలుగు రాష్ట్రాలలోని పలువురి నుంచి రూ.600 కోట్లు వసూలు చేసిన నౌహీరా గ్రూప్ విదేశాలకు నగదును తరలించి జనాన్ని మోసగించింది. దీనిపై ఓ ఖాతాదారుడి ఫిర్యాదుతో మోసం వెలుగులోకి వచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios