మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కును సవాల్ చేస్తూ బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ పిటిషన్ వేశారు.

జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 90(1)ని కొట్టివేయాలని పిటిషన్ లో అనిల్ కుమార్ కోరారు. ఈ పిటిషన్ నేపధ్యంలో హైకోర్టు  తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీకి నోటీసులు జారీ చేసింది. 

పిటిషన్ దారు ఆరోపించిన అంశాలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం, ఎస్ఈసీ, జీహెచ్ఎంసీకి హైకోర్టు ఆదేశించింది. దీనిమీద తదుపరి విచారణ జనవరి 4కి వాయిదా వేసింది.