హుపజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వ్యూహాత్మకంగా పనిచేస్తున్నాయి.
హుజూర్‌నగర్: హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డికి మద్దతుగా తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రచారం నిర్వహించనున్నారు. టీఆర్ఎస్‌లో ట్రబుల్ షూటర్ గా పేరున్నహరీష్ రావు ఈ నియోజకవర్గంలో నిర్వహించేందుకు రావడం టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహన్ని నింపే అవకాశం ఉంది.
ఈ నెల 21న హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఈ నెల 18వ తేదీన సీఎం కేసీఆర్ హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు ప్రకటించాయి.
అయితే ఈ నెల 17, 18 తేదీల్లో రెండు రోజుల పాటు మంత్రి హరీష్ రావు హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించనున్నారు. రెండు రోజుల పాటు హరీష్ రావు ప్రచారం నిర్వహించనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ సభ ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
మరో వైపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడ ఈ నెల 127, 18 తేదీల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో రెండు పార్టీలకు చెందిన కీలక నేతలు ఒకే సమయంలో ప్రచారం నిర్వహించనున్నారు.
ఈ నెల 18వ తేదీతో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నెల 21వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఈ నెల 24వ తేదీన ఓట్లను లెక్కించనున్నారు.
