హైదరాబాద్: తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి కవిత్వం కన్నా తనకు ఆయన తత్వం ఎక్కువ తెలుసునని తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేత హరీష్ రావు అన్నారు.  డాక్టర్ నందిని సిధారెడ్డి కవిత్వ జీవన ప్రస్థానం, సాహిత్య సమాలోచన అనే అంశంపై జరుగుతున్న రెండు రోజుల జాతీయ సదస్సులో ఆయన అలా అన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మందారం పుస్తకాన్ని ఆవిష్కరించి, మాట్లాడారు.సిధారెడ్డితో ఆత్మీయ అనుబంధం ఉందని, సాహిత్య రంగంలో తెలంగాణ ఉద్యమంలో సిధారెడ్డి గారి కృషి గొప్పదని ఆయన ప్రశంసించారు. 
తను సాహిత్య రంగంలో ఉంటూ ఎంతో మంది సాహిత్య వేత్తలను వెలుగులోకి తెచ్చారని అన్నారు. ఉద్యమ కాలంలో తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులుగా ఉండి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని ఆయన అన్నారు. 

ముక్కుసూటి మనిషి, నిరాడంబరుడుగా ఉండే వ్యక్తి సిధారెడ్డి అని, నాగేటి సాలల్ల నా తెలంగాణ పాట రచించి ఉద్యమానికి ఊపు తెచ్చారని అన్నారు.

సీఎం ప్రత్యేక అధికారి, కవి గాయకులు దేశ పతి శ్రీనివాస్, ఎంపీ బీబీ పాటిల్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు రమణ చారి, ఎమ్మెల్సీ ఫరీదుద్దిన్, తెలుగు యూనిర్సిటీ విసి ఎస్వీ సత్యనారాయణ పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ వీడియో చూడండి

నందిని సిధారెడ్డి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ (వీడియో)