ఊహించని పరిణామంతో భయబ్రాంతులైన కార్యకర్తలు.. అక్కడి నుంచి పరుగులు తీశారు. కాగా.. ఈ ఘటనలో హరీష్ రావు కి ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు.
తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావుకి తృటిలో పెను ప్రమాదం తప్పింది. టీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశమయ్యేందుకు హరీష్ రావు.. సంగారెడ్డి వెళ్లారు. కాగా,... ఈ సమావేశానికి కార్యకర్తలు వేల సంఖ్యలో హాజరయ్యారు.
తమ ప్రియతమ నేత సంగారెడ్డి వచ్చారనే ఆనందంతో కొందరు బాణసంచా పేల్చడంతో అనుకోకుండా ఒక్కసారిగా ఆ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. దీంతో.. సభా ప్రాంగణమంతా పొగలు కమ్ముకున్నాయి. ఊహించని పరిణామంతో భయబ్రాంతులైన కార్యకర్తలు.. అక్కడి నుంచి పరుగులు తీశారు. కాగా.. ఈ ఘటనలో హరీష్ రావు కి ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు.
వెంటనే ఆయనను భద్రతా సిబ్బంది ప్రత్యేక వాహనంలో అక్కడి నుంచి వేరే ప్రాంతానికి సురక్షితంగా పంపించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
