Asianet News TeluguAsianet News Telugu

వాక్సినేషన్ ప్రక్రియ : మోడీ ప్రభుత్వాన్ని తప్పు పట్టిన హరీష్ రావు

వాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనాలోచిత, అసందర్భ, తప్పుడు నిర్ణయాలతో దేశ, తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Harish Rao blames Modi government on Vaccination process - bsb
Author
Karimnagar, First Published Jun 5, 2021, 11:35 AM IST

వాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనాలోచిత, అసందర్భ, తప్పుడు నిర్ణయాలతో దేశ, తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

జిల్లా కేంద్రమైన సిద్ధిపేట బాలాజీ ఫంక్షన్ హాలులో శనివారం ఉదయం సిద్దిపేట జిల్లాలో హై రిస్క్ లకు కోవిడ్-19 వ్యాక్సినేషన్ టీకా కార్యక్రమాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. 

వాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనాలోచిత, అసందర్భ, తప్పుడు నిర్ణయాలతో దేశ, తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. 

వ్యాక్సినేషన్ ల విషయంలో అమ్మ పెట్టదు, అడుక్కొ నివ్వదు అన్న రీతిలో కేంద్రం వ్యవహారిస్తుందని అన్నారు. రాష్ట్రాలకు అవసరమైన వాక్సిన్ లను కేంద్రం ఉచితంగా ఏమీ సరఫరా చేయడం లేదని అన్నారు. 

కేసీఆర్ హుజూరాబాద్ ఆపరేషన్, ఈటెలకు చుక్కలు: నాగార్జునసాగర్ వ్యూహమే...

అంతేకాకుండా కంపెనీ లు, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొనివ్వడం లేదన్నారు. తెలంగాణలో ఉత్పత్తి అయిన వ్యాక్సిన్ను కూడా కంపెనీల నుంచి మనం కొనుక్కునే పరిస్థితి లేకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు.

కేంద్రం తప్పుల మీద తప్పులు చేస్తూ...రాష్ట్రాల ను బద్నాం చేసేలా కేంద్ర వ్యవహారిస్తోందని మండిపడ్డారు. వ్యాక్సినేషన్ సకాలంలో పంపిణీ లో కేంద్ర ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తుందన్నారు. 

వ్యాక్సిన్ పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను పున సమీక్షించుకోవాలన్నారు. వ్యాక్సినేషన్ దిగుమతిని సరళతరం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలే ప్రాధాన్యత క్రమాలను నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ను కంపెనీలు,ఇతర దేశాల నుండి దిగుమతి చేసే చేసుకునే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాల కొనుగోలుకు ఇప్పటికే ఆయా కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం రూ 100 కోట్లు అడ్వాన్స్ గా ఇచ్చిందని తెలిపారు.

నాడు కేసీఆర్ పై ప్రశంసలు.. నెట్టింట ఈటలపై విమర్శలు...

రాష్ట్రాలకు కేటాయించే వ్యాక్సిన్లు ఎన్ని ఇవ్వాలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయిం చడం వల్ల కంపెనీలు టీకాలను తెలంగాణకు ఇవ్వలేక పోతున్నాయన్నారు. తెలంగాణలో హై రిస్క్ స్కూల్ గ్రూపులకు, ప్రజలతో నిత్యం సంబంధాలు నెరిపే వ్యక్తులకు ప్రాధాన్యత క్రమంలో వ్యాక్సినేషన్ ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం అని చెప్పుకొచ్చారు. 

13 నగర పాలక సంస్థలు, 129 మున్సిపాలిటీ పరిధిలోని కూరగాయలు, పండ్లు విక్రేతలు, మద్యం విక్రేతలు, హోటల్ లో పనిచేసే వ్యక్తులు, స్మశాన వాటిక లో పనిచేసే వ్యక్తులు, కిరాణా షాపులో పనిచేసే వ్యక్తులు మొదలైన 8 లక్షల 50 వేల మందికి ప్రాధాన్యత క్రమంలో వ్యాక్సినేషన్ ఇస్తామన్నారు.

నేటి నుంచి 10 రోజుల పాటు వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుందని, ప్రాధాన్యత క్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులకు, ఉద్యోగులకు, ప్రజలతో అనునిత్యం సంబంధాలు నెరిపే వ్యక్తులకు వ్యాక్సినేషన్ ఇస్తామని అన్నారు.

తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు యుద్ధ ప్రాతిపదికన తీసుకుంటుందని తెలిపారు. ఇప్పటికే కరోనా కట్టడికి నిర్వహించిన ఇంటింటి సర్వే మంచి ఫలితాలను ఇచ్చిందన్నారు.

థార్డ్ వేవ్ ను కూడా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సర్వ సన్నద్ధంగా ఉందని తెలిపారు. ఆ దిశగా ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios