Asianet News TeluguAsianet News Telugu

ఇరిగేషన్ అధికారులకు షాక్ ఇచ్చిన మంత్రి హరీష్

  • కాళేశ్వరం ప్రాజెక్టు సర్ ప్రైజ్ విజిట్ చేసిన హరీష్ రావు
harish gives shocking twist irrigation staff

 

ఇరిగేషన్ శాఖ అధికారులకు, సిబ్బందికే కాదు.. ఏకంగా టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు కూడా ఊహించని షాక్ ఇచ్చారు తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు. అదెలాగో కింద చదవండి.

కాళేశ్వరం ప్రాజెక్టు  పనులలో మరింత వేగం పెంచడానికి ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు సోమవారం 'సర్జికల్'తనిఖీ చేశారు.రాష్ట్ర రైతు సమన్వయ సమితి సదస్సులో పాల్గొన్న మంత్రి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం పనులను పరిశీలించారు. .ఎల్.ఎలు,ఎం.పిలు,ఇతర ప్రజాప్రతినిధులకు,అధికారులకు సమాచారం ఇవ్వకుండా మంత్రి హుటాహుటిన ప్యాకేజి 8 కి చేరుకోవడంతో ఇరిగేషన్ అధికారులు, సిబ్బంది ఖంగుతిన్నారు.

ఈ నెల 22, 23 తేదీలలో కాళేశ్వరం పనులను పరిశీలించాలని నిర్ణయించినా....ఢిల్లీ పర్యటన ఇతర కార్యక్రమాలతో ఆయన పర్యటన వాయిదా పడింది. రైతు సమన్వయ సమితు ల సదస్సు వల్ల కరీంనగర్ కు చేరుకున్నందున సమయాన్ని క్షణం కూడా వృధా చేయకుండా ప్యాకేజి 8 పనులను తనిఖీలు నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో పనులను సందర్శించారు. గ్రావిటీ కెనాల్ పైన నిర్మిస్తున్న 10 స్ట్రక్చర్స్ పనులను పరిశీలించారు.పనులు ఇంకా వేగవంతం చేయాలని ఆదేశించారు. కెనాల్ లైనింగ్ త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఏజన్సీల ను ఆదేశించారు.వరద కాలువ జంక్షన్ పాయింట్ డిజైన్లు త్వరగా సబ్మిట్ చెయ్యాలని ఏజెన్సీని ఆదేశించారు. ప్రతిష్టాత్మక సాగునీటి ప్రాజెక్టు కాళేశ్వరాన్ని గడువు లోపున పూర్తి చేసేందుకు పనులు వేగవంతం చేయాలని అధికారులు,ఏజన్సీలను హరీష్ రావు ఆదేశించారు.పనులలో ఇంకా వేగం పెంచాలని ఆయన కోరారు. మోటార్ల బిగింపు పనులు, గేట్ల తయారీ బిగింపు పనులు  కూడా వేగం పుంజుకోవలసి ఉందని మంత్రి అన్నారు. ఈ ఏడాది కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు ఎత్తి తెలంగాణ బీడు భూముల్లో పారించాలనే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యాన్ని  సాధించాలని మంత్రి అన్నారు. ఇందుకు గాను రేయింబవళ్లు కృషి చేయాలని ఆయన కోరారు.

గోదావరిపై నిర్మించే మూడు బరాజ్‌లు, మూడు  పంప్‌ హౌజ్‌లతో పాటు కీలకమైన ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్ మార్గం పనుల పురోగతిని సి.ఎం.కేసీఆర్ నిరంతరం సమీక్షిస్తున్నట్టు చెప్పారు..కాళేశ్వరం కు చెందిన మేడిగడ్డ, అన్నారం,సుందిళ్ళ బ్యారేజీలు,పంపు హౌజ్ లు, అన్నారం-కన్నేపల్లి గ్రావిటీ కెనాల్ పనులతో పాటు  ఇతర ప్యాకేజిల పనులను వేగవంతం  చేయలన్నారు.  వర్షాకాలానికి ముందే సివిల్, మెకానికల్ పనులు పూర్తయ్యేలా చూడాలని ఇరిగేషన్ మంత్రి కోరారు. ఏజన్సీ ప్రతినిధులు,ఇరిగేషన్ అధికార యంత్రాంగం మరింత సమన్వయంతో పనులను వేగవంతం చేయాలని ఇరిగేషన్ మంత్రి కోరారు. ఆయన వెంట ఎం.పి. బి.బి.పాటిల్, ఈ.ఎన్. సి. అనిల్, కాళేశ్వరం సి.ఈ.నల్ల వెంకటేశ్వర్లు ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios