టెన్త్ క్లాస్ హిందీ పేపర్ లీక్  కేసులో  డీబారైన  హరీష్ హైకోర్టును  ఆశ్రయించారు.  సప్లింెటరీ పరీక్షలు రాసేందుకు  అనుమతివ్వాలని  హరీష్ తండ్రి  హైకోర్టులో  ఇవాళ  పిటిషన్ దాఖలు  చేశారు.


హైదరాబాద్:టెన్త్ క్లాస్ హిందీ పేపర్ లీక్ కేసులో డీబారైన హరీష్ గురువారంనాడు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంటక్ సహకరంతో హరీష్ తండ్రి ఇవాళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిన్న రాష్ట్ర ప్రభుత్వం టెన్త్ క్లాస్ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. అయితే హరీష్ ఫలితాలను ప్రకటించలేదు. మాల్ ప్రాక్టీస్ కేటగిరిలో హరీష్ ఫలితాలను విద్యాశాఖ ప్రకటించలేదు. 

హరీష్ పరీక్ష ఫలితాలను విడుదల చేయాలని నిన్న మధ్యాహ్నం ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బి. వెంకట్ నేతృత్వంలో బృందం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిశారు. కానీ హరీష్ ఫలితాలు వెల్లడించలేదు. దీంతో హరీష్ తండ్రి ఇవాళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సప్లిమెంటరీ పరీక్షలకు హరీష్ ను అనుమతించేలా అమతించాలని పిటిషనర్ కోరారు.

గత నెల 4వ తేదీన కమలా.పూర్ స్కూల్ లో హిందీ పేపర్ బయటకు వచ్చింది. హరీష్ అనే విద్యార్ధి నుండి పేపర్ ను ఫోన్ లో ఫోటో తీసుకొని వాట్సాప్ లో షేర్ చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో హరీష్ ను డీబార్ చేశారు. దరిమిలా పరీక్షలు రాసేందుకు అనుమతించాలని హరీష్ హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో హరీష్ ను పరీక్షలు రాసేందుకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రెండు పరీక్షలు మినహా మిగిలిన పరీక్షలు రాశాడు హరీష్. కానీ హరీష్ పరీక్ష ఫలితాలును ఇంకా ప్రకటించకపోవడంతో ఇవాళ హైకోర్టును ఆశ్రయించారు హరీష్ తండ్రి.

also read:తెలంగాణ టెన్త్ పేపర్ లీక్ కేసు: హోల్డ్‌లోనే హరీష్ ఫలితాలు

గత నెల 4వ తేదీన హిందీ పరీక్ష ప్రశ్నాపత్రం లీకైందని సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. హిందీ పేపర్ లీక్ కుట్ర కేసులో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై వరంగల్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.