గుడ్డు దశలోనే చిదిమేస్తున్న సమాజం నుంచి ఆడ బిడ్డను కాపాడాలని... ఆర్థిక సమస్యను తీర్చితే ఆడపిల్ల అమ్మానాన్నల గుండెలపై కుంపటి కాబోదని ఎంతోమంది నిరూపిస్తున్నారు.

కానీ ఇంకా పురిట్లోనే ఆడపిల్లను కాటేస్తున్న ఘటనలు ఇంకా కనిపిస్తూనే వున్నాయి, చెత్త కుప్పల్లో ఎంత మంది పోలీసులకు దొరుకుతున్నారో రోజూ పేపర్లలో చూస్తూనే వున్నాం.

అయితే ఓ వూరిలో మాత్రం ఆడపిల్లను మహాలక్ష్మీలా భావిస్తున్నారు. ఆడపిల్లపై ఇంత వివక్షత ఎదురవుతున్న ఈ తరణంలో అమ్మాయి పుడితే ఒక పండుగలా జరుపుతున్నారు

వివరాల్లోకి వెళితే.. ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం హరిదాస్పుర్ గ్రామంలో ఆడపిల్ల పుడితే ఊరు ఊరంతా పండుగలా జరపుకుంటున్నారు. ఈ పద్దతి గతేడాది నుంచే ప్రారంభమైంది.

1 జనవరి 2020లో మొదలవ్వగా అప్పటి నుంచి ఊరిలో ఎవరి ఇంట్లోనైనా ఆడపిల్ల జన్మిస్తే.. గ్రామస్తులు ఒకరికొకరు స్వీట్లు పంచుకుంటూ వుంటారు. అలాగే పుట్టిన పాప పేరు మీద రూ. 1,000 ల చెక్కు అందజేస్తారు ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్.

దీనిని సుకన్య సమృద్ధి పథకం కింద వెయ్యి రూపాయలు జమ చేస్తున్నారు గ్రామస్తులు. 10 ఏళ్లలోపు ఉన్న ఇద్దరు కూతుర్ల పేరుపై సుకన్య సమృద్ధి అంకౌంట్లను ప్రారంభించారు . అలా ఇక్కడి వారు తమ ఇంటి మహాలక్ష్మీని ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు హరిదాస్‌పూర్ గ్రామస్తులు.