దావోస్ వేదికగా అరుదైన ఘటన : ‘నా సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ తో గొప్ప సమావేశం జరిగింది’... కేటీఆర్ ట్వీట్..
దావోస్ వేదికగా అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కేటీఆర్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని.. సరదాగా మాట్లాడుకున్నారు. ఫొటోలకు ఫోజులిచ్చారు.
హైదరాబాద్ : విదేశీ గడ్డ మీద అరుదైన కలయిక జరిగింది. Davos వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి YS Jaganmohan Reddy, తెలంగాణ మంత్రి Kalvakuntla Tarakaramaravu ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. నా సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ గారితో గొప్ప సమావేశం జరిగింది అంటూ మంత్రి కేటీఆర్ తన Twitter లో పోస్ట్ చేశారు. వీళ్లిద్దరూ ఎంతసేపు భైటీ అయ్యారు, ఏయే అంశాలమీద చర్చించారనే దానిమీద స్పష్టత రావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే, దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల సందర్భంగా పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సీఎం వైఎస్ జగన్ వరుసగా సమావేశం అవుతున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరిస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల్లో భాగస్వాములు కావడానికి పలు కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇంకోవైపు మంత్రి కేటీఆర్ కూడా తెలంగాణ పెట్టుబడుల ఆహ్వాన విషయంలో దూసుకుపోతున్నారు.
ఇదిలా ఉండగా, దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోరోజు (సోమవారం) ఫ్యూచర్ ప్రూఫింగ్ హెల్త్ సిస్టమ్స్ అంశంపై మాట్లాడారు. డబ్ల్యూఈఎఫ్ పబ్లిక్ సెషన్ లో పాల్గొన్న ఆయన ఏపీలో వైయస్ జగన్ కోవిడ్ నియంత్రణకు తీసుకున్నచర్యలతో పాటు రాష్ట్రంలో వైద్య వ్యవస్థలో ఎలా బలోపేతం చేస్తుందని వివరించారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం తీరు తెన్నులను వెల్లడించారు.
కరోనా నియంత్రణ
ఏపీలో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను అనుగుణంగా covid నియంత్రణ కార్యాచరణ అమలు చేశాం. ఇందుకోసం ప్రతీ 50 ఇళ్లకు ఒక వలంటీర్ వంతున పనిచేశారు. 42 వేల మంది ఆశ వర్కర్లు ఇందులో పాలుపంచుకున్నారు. ఇంటింటికీ వెళ్లి కోవిడ్ లక్షణాలు కనిపించిన వారిని గుర్తించాం. ప్రత్యేకంగా ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేశాం. మెడిసిన్స్ అందించాం. రోగులు అవసరమైన పౌష్టిక ఆహారం అందిస్తూ పకడ్బందీ ప్రణాళిక అమలు చేశాం. అందువల్లే కరోనా మరణాల రేటు ఏపీలో జాతీయ స్థాయి కన్నా చాలా తక్కువగా.. దేశంలోనే అత్యల్పంగా 0.6 శాతంగా నమోదయ్యింది.
ఫ్యామిలీ డాక్టర్ తరహాలో…
ప్రజల ఆరోగ్య పరిరక్షణ విషయంలో వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యం. ఆ తర్వాత ఏమైనా రోగాలు వస్తే వాటికి సరైన సమయంలో వైద్యం అందించడం అనేది మరో కీలకమైన అంశం. ఈ రెండు అంశాలను బేస్ చేసుకుని ఏపీలోహెల్త్ కేర్ సిస్టంను రెడీ చేశాం. రాష్ట్రంలో రెండు వేల జనాభా కలిగిన ఒక గ్రామంలో విలేజ్ క్లినిక్లను ఏర్పాటు చేశాం. వీటిపైన ప్రతీ 13 వేల జనాభా మండలం యూనిట్గా రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నెలకొల్పాం. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నలుగురు డాక్టర్లు ఉంటారు. అంటే ప్రతి పీహెచ్సీకి ఇద్దరు డాక్టర్లు ఉంటారు.