Telangana: ఘ‌ట్‌కేస‌ర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ద్విచ‌క్ర వాహ‌నాల (బైకులు) చోరిల‌కు పాల్ప‌డుతున్న దొంగ‌ల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వ‌ద్ద నుంచి 11 ద్విచ‌క్ర వాహ‌నాలు స్వాధీనం చేసుకున్నారు.  

Telangana: ఘ‌ట్‌కేస‌ర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ద్విచ‌క్ర వాహ‌నాల (బైకులు) చోరీల‌కు పాల్ప‌డుతున్న దొంగ‌ల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వ‌ద్ద నుంచి 11 ద్విచ‌క్ర వాహ‌నాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గ‌తేడాది (2021) సెప్టెంబరు నుంచి నవంబర్ (2021) మధ్య కాలంలో మొత్తం మూడు మోటార్ సైకిళ్లు దొంగతనానికి గురయ్యాయి. ఈ ద్విచ‌క్ర వాహ‌నాల దొంగ‌త‌నాలకు సంబంధించి ఘట్‌కేసర్ పోలీసు స్టేష‌న్ (రాచకొండ) లో మూడు కేసులు న‌మోద‌య్యాయి. 

టూ వీల‌ర్ దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతున్న ముఠాపై ప్ర‌త్యేక దృష్టి సారించిన రాచ‌కొండ పోలీసులు.. యమ్నంపేట్ X రోడ్ సమీపంలో అనుమానాస్పద పరిస్థితులలో క‌నిపించిన ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించ‌గా.. ద్విచ‌క్ర వాహ‌నాల దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతున్న విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఈ కేసులు నిందితులుగా ఉన్న ఏ1 చిందం రాజు S/o నర్సింహ Jnnrm కాలనీ, బోగారం గ్రామంలో ఉంటూ పెయింట‌ర్ గా కూడా ప‌నిచేస్తున్నాడు. ఇత‌ని స్వస్థ‌లం యాదాద్రి జిల్లాలోని బొమ్మ‌ల రామారం మండ‌లం ప్యారారం గ్రామం. మ‌రో నిందితుడు ఏ2 చిందం మహేష్ S/o మైసయ్య. ఇత‌న నాగోల్ లోని మ‌మ‌తాన‌గ‌ర్ లో నివాస‌ముంటున్నారు. ఇత‌ని స్వస్థ‌లం యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలంలోని పిల్లయ్యపల్లె గ్రామం. 

ఈ ఇద్ద‌రు నిందితుల నుంచి మొత్తం 11 బైకుల‌ను స్వాధీనం చేసుకున్నారు. బోగారం గ్రామంలోని జేఎన్యూఆర్ఎం కాలనీలో ఉన్న ఎ-1 చింతంరాజు నివాసం నుండి 5 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, నాగోల్ లోని మమత నగర్ కాలనీలో ఉన్న ఎ-2 చింతం మహేష్ నివాసం నుండి నాలుగు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు... ఆ తర్వాత నిందితులు ఏ1, ఏ2లను జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. నిందితులు నివాసముంటున్న ప్రాంతంలోని బస్టాండ్లు, ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్ మెంట్ సెంటర్లు వంటి రద్దీగా ఉండే కేంద్రాల వద్ద పార్క్ చేసిన మోటారు సైకిళ్లను గుర్తించి దొంగతనాలకు పాల్పడుతున్నార‌ని పోలీసులు తెలిపారు.

అలాగే, ల్యాప్ టాప్ ల చోరీకి పాల్పడుతున్న కేసును కూడా పోలీసులు చేధించారు. వివ‌రాల్లోకెళ్తే.. ఘ‌ట్‌కేస‌ర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2021 మార్చి నుంచి 2022 ఏప్రిల్ వరకు మొత్తం 17 ల్యాప్ టాప్ లు చోరీకి గురయ్యాయి. ఈ దొంగ‌త‌నాల‌కు సంబంధించి ఘ‌ట్‌కేస‌ర్ పోలీసు స్టేష‌న్ లో 12 కేసులు న‌మోద‌య్యాయి. ఈ క్ర‌మంలోనే ల్యాప్‌టాప్ చోరీల‌పై పోలీసులు ప్ర‌త్యేక దృష్టి పెట్టారు.ఘ‌ట్‌కేస‌ర్ ప‌రిధిలో నిందితుడు అనుమాన‌స్ప‌దంగా క‌నిపించాడు. అత‌ని వ‌ద్ద రెండు ల్యాప్‌టాప్ లు ఉన్న‌ట్టు గుర్తించారు. అనుమానం క‌లిగిన పోలీసులు.. నిందితుడిని ప్ర‌శ్నించ‌గా.. చోరీకి పాల్ప‌డిన విష‌యాల‌ను వెల్ల‌డించారు. ల్యాప్‌టాప్ దొంగ‌త‌నాలకు పాల్ప‌డుతున్న నిందితుడిని దేవసోత్ దిలీప్ రాథోడ్ (Devasoth Dilip Rathod S/o Teekam Rathod) గా పోలీసులు గుర్తించారు. మొద‌ట నిందితుల వ‌ద్ద నుంచి రెండు ల్యాప్‌టాప్ లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆ త‌ర్వాత నిందితుల ఇంటి వ‌ద్ద నుంచి మ‌రో 15 ల్యాప్‌టాప్ లు.. మొత్తం 17 ల్యాప్ టాప్ లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. తాళం వేయని బ్యాచిలర్స్ రూమ్ లను టార్గెట్ చేసి ఈ దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతున్నార‌ని పోలీసులు పేర్కొన్నారు.