మతిస్థిమితం లేనోళ్లు, వారి చాప్టర్ క్లోజ్ : కోమటిరెడ్డి బ్రదర్స్ పై గుత్తా ఫైర్

First Published 15, May 2019, 7:40 PM IST
gutta sukender reddy slams komatireddy brothers
Highlights

మతిస్థిమితం లేకుండా మాట్లాడడం కోమటిరెడ్డి బ్రదర్స్‌కు సర్వసాధారణమైపోయిందన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ రాజకీయ జీవితం చివరి అంకంలో ఉందన్నారు. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కోమటిరెడ్డి బ్రదర్స్ మాటలు వింటుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. 

హైదరాబాద్: కోమటిరెడ్డి బ్రదర్స్‌పై టీఆర్‌ఎస్ నేత గుత్తా సుఖేందర్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ పొలిటికల్ చాప్టర్ క్లోజ్ అవ్వబోతుందంటూ వ్యాఖ్యానించారు. మతిస్థిమితం లేకుండా మాట్లాడడం కోమటిరెడ్డి బ్రదర్స్‌కు సర్వసాధారణమైపోయిందన్నారు. 

కోమటిరెడ్డి బ్రదర్స్‌ రాజకీయ జీవితం చివరి అంకంలో ఉందన్నారు. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కోమటిరెడ్డి బ్రదర్స్ మాటలు వింటుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్  కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డిలు ప్రస్తుతం అనామకులుగా మారారని విమర్శించారు. 

కనీసం ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను పెట్టే ధైర్యం కూడా చెయ్యలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉందని ఎద్దేవా చేశారు. నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని గుత్తా సుఖేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 

loader