తెలంగాణ శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్‌లోని ఐదు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి

తెలంగాణ శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్‌లోని ఐదు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. గుత్తా సుఖేందర్ రెడ్డి హైదరాబాద్‌ నుంచి నల్లగొండ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పెద్ద అంబర్‌పేట సమీపంలో రాగానే కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాదం నుంచి సుఖేందర్‌రెడ్డి క్షేమంగా బయటపడినట్టుగా సమాచారం. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.