హుజూర్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య పోటాపోటి నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో ఎలాంటి అక్రమాలు,అవకతవకలు జరక్కుండా పోలీసులు, ఈసి అధికారులే కాదు అభ్యర్థులు కూడా నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. 

ఈ క్రమంలో టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి స్వగ్రామం గుండ్లపల్లి లో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్లారు. అక్కడ ఓ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడానికి ఉత్తమ్ ప్రయత్నించగా గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో చేసేదేమిలేక ఉత్తమ్ అక్కడి నుండి వెనుదిరగాల్సి వచ్చింది. 

అలాగే  తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో మరికొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొడంగల్ లో టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. అలాగే ఖైరతాబాద్, శేరిలింగంపల్లి వంటి ప్రాంతాల్లో చెదురు మదురుగా కొన్ని ఉద్రిక్త సంఘటనలు చోటుచేసుకున్నాయి.

 కొన్ని చోట్ల  చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ కు అంతరాయం కలుగుతోంది. అలాగే మరికొన్ని చోట్ల గుత్తా జ్వాల వంటి సెలబ్రిటీల ఓట్లు గల్లంతయ్యాయి. ఇలా చిన్న చిన్న సంఘటనలు మినహాయిస్తే అన్నిచోట్లా పోలింగ్ విజయవంతంగా కొనసాగుతోంది.
 

వీడియో

"