ఆదిలాబాద్‌లో కాల్పుల కలకలం సృష్టించింది. ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫారూక్ అహ్మద్ ఇద్దరిపై కాల్పులు జరిపాడు. దీంతో బాధితుల్ని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

కాల్పుల ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. పాతకక్షల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరుగుతుండగా అది కాల్పులకు దారి తీసింది.

వీరిలో ఒకరి తల, మరొకరికి పొట్ట భాగంలో బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఒక చేతిలో తుపాకీ, మరొ చేత్తో తల్వార్‌తో అహ్మద్ వీర వీహారం చేశారు.