తెలంగాణలో గుజరాత్ ఏటీఎస్ సోదాలు నిర్వహించడం కలకలం రేపింది.  ఇటీవల పొరుబందర్‌లో పట్టుబడ్డ ఐకేపీఎస్ ఉగ్రవాదులతో సంబంధాలపై వీరు ఆరా తీసినట్లుగా సమాచారం. 

తెలంగాణలో గుజరాత్ ఏటీఎస్ సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. హైదరాబాద్ పాతబస్తీతో పాటు రామగుండంలో ఏటీఎస్ బృందాలు తనిఖీలు నిర్వహించారు. ఇటీవల పొరుబందర్‌లో పట్టుబడ్డ ఐకేపీఎస్ ఉగ్రవాదులతో సంబంధాలపై వీరు ఆరా తీసినట్లుగా సమాచారం. పట్టుబడ్డ ఐదుగురు ఉగ్రవాదుల్లోని ఒక మహిళకు హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఫసీ అనే వ్యక్తితో సంబంధాలు వున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు రామగుండంలో సాఫ్ట్‌వేర్ ట్రైనర్ జావీద్ ఇంట్లో తనిఖీలు చేపట్టిన ఏటీఎస్.. అతనిని, అతని కుమార్తెను అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.