ఓ వివాహిత పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఆకతాయిని స్థానికులు చెట్టుకు కట్టేసి చితకబాదారు. వివరాల్లోకి వెళితే.. నల్గొండలోని అర్జాల బావిలో శ్రీశైలం అనే పొకిరి యువతులు, మహిళల పట్ల వెకిలి చేష్టలు చేసేవాడు.

ఈ క్రమంలో ఓ వివాహితను వేధించడం మొదలుపెట్టాడు.. వెకిలి చూపులతో అసభ్యకర సైగలకు పాల్పడుతూ ఆమెను వేధింపులకు గురిచేసేవాడు. వివాహిత ఇంటి పరిసరాల్లో సంచరిస్తూ ఇంట్లోకి తొంగి చూసేవాడు.

ఈ విషయాన్ని ఆమె భర్తకు చెప్పింది. ఈ క్రమంలో గురువారం సీసీ కెమెరాల ద్వారా శ్రీశైలం రాకను పసిగట్టిన వివాహిత భర్త ఇంటి దగ్గరకు రాగానే అతనిని పట్టుకున్నారు. అనంతరం పోకిరిని చెట్టుకు కట్టేసి స్థానికులతో కలిసి చితకబాదారు. పోలీసులకు సమాచారం అందించి శ్రీశైలంను అప్పగించారు.