కేటీఆర్‌ను కలిసిన ప్రవల్లిక కుటుంబ సభ్యులు .. సోదరుడికి ఉద్యోగం , న్యాయం చేస్తానన్న మంత్రి

ఇటీవల ఆత్మహత్య చేసుకున్న గ్రూప్ 2 అభ్యర్ధిని ప్రవల్లిక కుటుంబ సభ్యులు బుధవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ను కలిశారు . ప్రవల్లిక సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని .. ఆ కుటుంబానికి అండగా వుంటామని కేటీఆర్ పేర్కొన్నారు.  

group 2 aspirant pravallika family members meets minister ktr ksp

ఇటీవల ఆత్మహత్య చేసుకున్న గ్రూప్ 2 అభ్యర్ధిని ప్రవల్లిక కుటుంబ సభ్యులు బుధవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా వెల్లడించారు. కరీంనగర్‌లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రవల్లిక కుటుంబ సభ్యులు ఇవాళ తనను కలిశారని తెలిపారు. ఒకడు మా అమ్మాయిని వేధించి చంపాడని తన దృష్టికి తీసుకొచ్చారని.. న్యాయం చేస్తానని వాళ్లకు హామీ ఇచ్చానని మంత్రి వెల్లడించారు. 

ప్రవల్లిక సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని .. ఆ కుటుంబానికి అండగా వుంటామని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే బాధితురాలి విషయంలో కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్‌పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని.. నిరుద్యోగులకు న్యాయం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని.. రాహుల్, ప్రియాంక గాంధీలు వచ్చి మాయమాటలు చెబుతారని కేటీఆర్ హెచ్చరించారు. బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల వారీకి న్యాయం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. 

 

 

Also Read: మమ్మల్ని రాజకీయాల్లోకి లాగొద్దు.. శివరామ్ వల్లే ప్రవల్లిక ఆత్మహత్య : కుటుంబ సభ్యులు

కాబోయే ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు అభినందనలు చెప్పారు కేటీఆర్. లోక్‌సభ ఎన్నికల్లో వినోద్‌ను కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని.. గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఏం చేశాడని మంత్రి ప్రశ్నించారు. మోడీ ఎందుకు దేవుడో సంజయ్ చెప్పాలని.. మోడీ చెప్పినట్లు రూ.15 లక్షలు వచ్చినవాళ్లంతా బీజేపీకి ఓటు వేయాలని .. రానివాళ్లు బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని కేటీఆర్ చురకలంటించారు. కేసీఆర్ అందరివాడని.. ఏ ఒక్క మతానికో లేక వర్గానికో చెందిన వ్యక్తి కాదన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓ క్రిమినల్ అని.. ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన వ్యక్తి అని కేటీఆర్ దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమానికి బీజం పడింది కరీంనగర్‌లోనే అని.. బీఆర్ఎస్‌ను మరోసారి గెలిపించాలని మంత్రి ఓటర్లకు పిలుపునిచ్చారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios