తనను ప్రేమించి మరో యువతిని పెళ్లి చేసుకొంటున్నాడని ప్రియుడు వివాహం చేసుకొనే పెళ్లి మండపం వద్ద ఓ యువతి రచ్చ చేసింది. ప్రియుడి బంధువులు యువతిని చితకబాదారు ఈ ఘటన ఖమ్మంలో చోటు చేసుకొంది. 

ఖమ్మం: తనను ప్రేమించి మరో యువతితో Marriage చేసుకొంటున్నాడని పెళ్లి మండపంలో ఓ Woman నానా హంగామా చేసింది. తన Lover పెళ్లిని ఆపేందుకు ప్రయత్నించింది. దీంతో యువకుడి బంధువులు ఆ యువతిని Function Hall నుండి ఈడ్చుకొంటూ బయటకు తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Khammam పట్టణంోని ఓ పెళ్లి మండపంలో ఇవాళ పెళ్లి జరుగుతుంది. Srinath అనే యువకుడు వివాహం జరగడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో ఓ యువతి పెళ్లి మండపానికి వచ్చి నానా హంగామా చేసింది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన యువతి తనతో కాకుండా మరో యువతిని శ్రీనాథ్ పెళ్లి చేసుకొంటున్నాడని మండిపడింది. మండపంలో రచ్చ చేసింది. పెళ్లి జరిగే సమయంలో ఈ యువతి ఎంటర్ కావడంతో షాక్ కు గురైన యువకుడి బంధువులు యువతిని చితకబాదారు. పెళ్లి మండపం నుండి యువతిని ఈడ్చుకొంటూ బయటకు తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకొన్న పోలీసులు పెళ్లి మండపం వద్దకు చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.