Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్‌‌‌కు రెండు ప్రతిష్టాత్మక సంస్థలు, భారీ పెట్టుబడి

హైదరాబాద్ నగరానికి పెట్టుబడుల పరంపర కొనసాగుతుంది. ఇందులో భాగంగా మంగళవారం మరో రెండు ప్రముఖ ఫార్మా కంపెనీలు గ్రాన్యూల్స్ ఇండియా, లారస్ ల్యాబ్స్ తమ పెట్టుబడులను ఈ రోజు ప్రకటించాయి. ఈ రెండు హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీ లో తమ తయారీ యూనిట్లను నెలకొల్పనున్నాయి

granules india ltd and laurus labs invest in telangana ksp
Author
Hyderabad, First Published Oct 27, 2020, 4:36 PM IST

హైదరాబాద్ నగరానికి పెట్టుబడుల పరంపర కొనసాగుతుంది. ఇందులో భాగంగా మంగళవారం మరో రెండు ప్రముఖ ఫార్మా కంపెనీలు గ్రాన్యూల్స్ ఇండియా, లారస్ ల్యాబ్స్ తమ పెట్టుబడులను ఈ రోజు ప్రకటించాయి. ఈ రెండు హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీ లో తమ తయారీ యూనిట్లను నెలకొల్పనున్నాయి.

హైదరాబాద్ నగరానికి చెందిన గ్రాన్యూల్స్ ఇండియా ఈరోజు 400 కోట్ల రూపాయల పెట్టుబడిని తన తయారీ యూనిట్ కోసం తెలంగాణలో పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ నాలుగు పెట్టుబడితో 10 బిలియన్ ఫినిష్డ్ డోసులను తయారు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడి ద్వారా సుమారు 16 వందల మందికి ఉపాధి లభిస్తుందని కంపెనీ తెలిపింది.

 గ్రాన్యూల్స్ ఇండియా ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది ప్రాంతాల్లో తయారీ యూనిట్లను కలిగి ఉంది. మొత్తం 75 దేశాల్లో తమ కార్యకలాపాలను కొనసాగిస్తుంది. ఇప్పటికే ఈ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద కమర్షియల్ ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్ ఇంటర్మీడియట్ యూనిట్‌ని‌ హైదరాబాద్‌కి దగ్గర్లో ఉన్న గాగిల్లాపూర్ వద్ద కలిగి ఉన్నది. 

తమ కంపెనీకి సంబంధించిన పెట్టుబడిని అధికారికంగా ప్రకటించేందుకు కంపెనీ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణప్రసాద్ ఈ రోజు ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్‌ను కలిశారు.  

ఇక ప్రముఖ ఫార్మాస్యూటికల్ తయారీ కంపెనీ లారస్ ల్యాబ్స్ ఈరోజు 300 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రకటనను మంత్రి కేటీఆర్‌ను కలిసిన తర్వాత చేసింది. ఆ సంస్థ సీఈఓ సత్యనారాయణ చావ ఈరోజు మంత్రి ని ప్రగతిభవన్‌లో కలిశారు.

తమ సంస్థ హైదరాబాదులో చేయనున్న 300 కోట్ల రూపాయల పెట్టుబడి, రెండు దఫాలుగా ఉంటుందని ఆయన కేటీఆర్ కి తెలియజేశారు. 5  బిలియన్ డోసుల కెపాసిటీ కలిగిన ఫార్ములేషన్ ఫెసిలిటీ యూనిట్ కోసం ఈ పెట్టుబడి ఉంటుందని సత్యనారాయణ వెల్లడించారు. 

ఇప్పటికే లారస్ ల్యాబ్ కి జీనోమ్ వ్యాలీ లోని ఐకేపీ నాలేడ్జ్ పార్క్ లో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌ సెంటర్ ఉంది. సంస్థకు ఉన్న ఆరు ఇతర మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ ప్రపంచంలోని అనేక దేశాల నుంచి అనుమతులు పొంది ఉన్నాయి.

లారస్ ల్యాబ్స్ యాంటీ రిట్రోవైరల్, ఆంకాలజీ, కార్డియోవాస్క్యులర్, యాంటీ డయాబెటిక్స్, యాంటీ ఆస్తమా మరియు గ్యాస్ట్రోఎంట్రాలజీ కి సంబంధించిన ఏపీఐలను తయారు చేస్తుంది.

మరోవైపు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన లారస్ ల్యాబ్స్ , గ్రాన్యూల్స్ ఇండియా కంపెనీలను మంత్రి కే . తారకరామారావు స్వాగతించారు. రెండు కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. 

రాష్ట్రానికి అనేక రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు కొనసాగుతున్నాయని, దీనికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి నాయకత్వంలో అద్భుతమైన పారిశ్రామిక పాలసీలు కలిగి ఉండటమేనని మంత్రి కేటీఆర్ అన్నారు.

తెలంగాణ ప్రభుత్వ విధానాల వలన ఐటీ, ఫార్మా, టెక్స్‌టైల్స్, ఏరోస్పేస్, డిఫెన్స్ మరియు ఇతర రంగాల్లో అనేక పెట్టుబడులు వస్తున్నాయని, ఈ రోజు తెలంగాణకు రానున్న ఈ రెండు పెట్టుబడుల ద్వారా తయారీ రంగంలో పెద్ద ఎత్తున స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios