ఫెమా నిబంధనల ఉల్లంఘనలు: ఈడీ విచారణకు హాజరైన గ్రానైట్ వ్యాపారులు
ఫెమా నిబంధనల ఉల్లంఘనల కేసులో పలువురు గ్రానైట్ వ్యాపారులు సోమవారంనాడు విచారణకు హాజరయ్యారు. సుమారు ఎనిమిది మంది గ్రానైట్ వ్యాపారులు ఈడీ విచారణకు హాజరయ్యారు.
హైదరాబాద్: ఫెమా నిబంధనల ఉల్లంఘనల కేసులో పలువురు గ్రానైట్ వ్యాపారులు సోమవారంనాడు విచారణకు హాజరయ్యారు. ఇటీవలనే పలు గ్రానైట్ కంపెనీల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. విచారణకు రావాలని ఈడీ అధికారులు గ్రానైట్ వ్యాపారులను కోరారు. దీంతో పలువురు ఈడీ అధికారులు ఇవాళ విచారణకు హాజరయ్యారు. రూ. 124 కోట్ల విలువైన పన్నును ఎగ్గొట్టారని గ్రానైట్ కంపెనీలపై ఆరోపణలున్నాయి. సీనరేజీని ఎగ్గొట్టేందుకు గ్రానైట్ ను తక్కువగా చూపారని గ్రానైట్ వ్యాపారులపై ఆరోపణలున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విషయమై గ్రానైట్ కంపెనీలపై ఆరోపణలున్నాయి. సుమారు రూ. 124 కోట్ల పన్నును ఎగ్గొట్టారని గ్రానైట్ కంపెనీలపై ఆరోపణలున్నాయి. 2103లో అప్పటి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్. ఇప్పటికే 8 గ్రానైట్ కంపెనీల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.