ప్రజాకూటమి అభ్యర్థిగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన సండ్ర... 19వేల మెజార్టీతో విజయం సాధించారు. 

టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు సత్తుపల్లిలో ఘనస్వాగతం లభించింది. ప్రజాకూటమి అభ్యర్థిగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన సండ్ర... 19వేల మెజార్టీతో విజయం సాధించారు. కాగా.. ఆయనకు ప్రజాకూటమి నాయకులు, కార్యకర్తలు, సండ్ర అభిమానులు బాణసంచా కాలుస్తూ, పులవర్షంతో సత్తుపల్లిలో ఘనస్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా పట్టణంలోని నందమూరి తారకరామారావు విగ్రహానికి సండ్ర పూల మాలలేసి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ జెండాను ఆవిష్కరించారు. అక్కడి నుంచి ర్యాలీగా బయల్దేరి రింగ్‌సెంటర్‌, బాలాజీ థియేటర్‌, పాత సెంటర్‌ మీదుగా స్థానిక మాధురీ పంక్షన్‌ హాల్‌ వద్దకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి అనంతరం పంక్షన్‌ హాల్‌లో విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు.

 విజయోత్సవసభలో సండ్రకు ప్రజాకూటమి నాయకులు, సండ్ర అభిమానులు ఘనంగా సన్మానించి, గజమాలతో సత్కరించారు. నియోజకవర్గంలోని పలుప్రాంతాల నుంచి వచ్చిన ప్రజాకూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది.