Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్ ప్లీనరీకి ఘనంగా ఏర్పాట్లు: ముస్తాబైన హెటెక్స్

టీఆర్ఎస్ ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీఆర్ఎస్ నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది కరోనా తగ్గుముఖం పట్టింది. దీంతో టీఆర్ఎస్ ప్లీనరీని, పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వఁహించాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకొంది.ప్లీనరీకి రాష్ట్రంలో ఎంపిక చేసిన ప్రతినిధులను ఆహ్వానించింది ఆ పార్టీ నాయకత్వం.

Grand arrangements in place for TRS plenary on Oct 25
Author
Hyderabad, First Published Oct 24, 2021, 4:15 PM IST

హైదరాబాద్: టీఆర్ఎస్ ప్లీనరీతో పాటు ఆ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. Trs  రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నిక కూడా రేపే జరగనుంది. హైద్రాబాద్ Hitexలో టీఆర్ఎస్ ప్లీనరీ జరగనుంది. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా 20 ఏండ్ల క్రితం  టీఆర్‌ఎస్‌ ఏర్పాటైంది.2014 జూన్ 2న తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించింది. కొత్త రాష్ట్రానికి Kcr సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఏడేండ్లుగా కేసీఆర్ తెలంగాణ  సీఎంగా కొనసాగుతున్నారు.

also read:Huzurabad bypoll: కేసీఆర్, ఈటల రాజేందర్‌కి ప్రతిష్టాత్మకమే

2014, 2018లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ విజయం సాధించింది.గత ఏడాది కరోనా కారణంగా టీఆర్ఎస్ సంస్థాగత కార్యక్రమాలను వాయిదా వేశారు. ఈ ఏడాది కరోనా తగ్గుముఖం పట్టింది. దీంతో టీఆర్ఎస్ ప్లీనరీని, పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వఁహించాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకొంది.ప్లీనరీకి రాష్ట్రంలో ఎంపిక చేసిన ప్రతినిధులను ఆహ్వానించింది ఆ పార్టీ నాయకత్వం.అన్ని జిల్లాల నుంచి వచ్చే ప్రతినిధులకు ఏర్పాట్లు ఎలాంటి ఇబ్బందులు కాకుండా చర్యలు తీసుకొంటున్నారు.కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్లీనరీ ప్రాంగణంలో 6,500 మందికి, హెటెక్స్ వెలుపల  4వేల మందికి అన్ని ఏర్పాట్లు చేశారు.

 ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం గంటల వరకు కార్యక్రమాలు నిర్వహిస్తారు.ప్లీనరీ మొదలు కాగానే సీఎం కేసీఆర్ TRS అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి ప్రకటిస్తారు. ఆ తర్వాత ప్లీనరీని ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడతారు. ఈ సందర్భంగా  ఏడు తీర్మానాలు ఆమోదించనున్నారు. టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నిక తర్వాత కొత్త అధ్యక్షుడి ప్రసంగం ఉంటుంది.  తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా రాజకీయ తీర్మానాలుంటాయి.హాజరయ్యే ప్రతినిధులు తమ పేర్ల నమోదు కోసం 35 కౌంటర్లు ఏర్పాటుచేసినట్టు తెలిపారు. హైటెక్స్‌కు ఇరువైపులా 50 ఎకరాల స్థలంలో పార్కింగ్‌ ఏర్పాట్లు చేశారు. 

ప్లీనరీకి వచ్చే వారికి భోజన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. 29 రకాల వంటలు సిద్ధం చేస్తున్నారు. ఒకే సారి 8 వేల మంది భోజనం చేసేలా మూడు  డైనింగ్ హాల్స్ సిద్ధం చేశారు. వీవీఐపీలు, ప్రజాప్రతినిధులు, మహిళల కోసం ప్రత్యేకంగా డైనింగ్ హాల్స్ రెడీ చేశారు. తెలంగాణ ప్రత్యేకమైన నాన్ వెజ్, వెజ్ వంటకాలు వడ్డించనున్నారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫుడ్ కమిటీ ఇన్ ఛార్జిగా ఉన్నారు. చికెన్ ధమ్ బిర్యానీ, మటన్ కర్రీ, నాటుకోడి పులుసు, పాయా సూప్, బోటి ఫ్రై, ఎగ్ మసాలా, రుమాలీ రోటీ, ఆలూ క్యాప్సికం, బగారా రైస్, వెజ్ బిర్యానీ, వైట్ రైస్, గుత్తి వంకాయ, చామగడ్డ పులుసు, బెండకాయ కాజు ఫ్రై, దాల్ రైస్, పాలకూర మామిడికాయ పప్పు, పచ్చి పులుసు, ముద్ద పప్పు, సాంబార్, ఉలవచారు, క్రీమ్, పెరుగు, వంకాయ చట్నీ, జిలేబీ, డబల్ కా మీఠా, ఐస్ క్రీ లాంటి వంటకాలను వడ్డించనున్నారు. ఇందుకోసం 500 మంది వంటవాళ్లను, సహాయకులను నియమించారు.  


 

Follow Us:
Download App:
  • android
  • ios