మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వాధికారుల ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆసరా పెన్షన్ల సొమ్మును కాజేసేందుకు అధికారులు పన్నాగం పన్నారు. చనిపోయిన వారి వేలిముద్రలు సేకరించి వాటి సాయంతో పెన్షన్ సొమ్మును తమ ఖాతాలో వేసుకున్నాడు.

సుమారు మూడు, నాలుగేళ్లుగా పెన్షన్‌ సొమ్మును దోచుకుంటున్న వీరి వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. దీనిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.