హర్ ఘర్ తిరంగ క్యాంపెయిన్‌లో భాగంగా హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లోని శానిటరీ, హార్టికల్చరల్ సిబ్బంది తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ జాతీయ జెండాలు, దుస్తులు పంపిణీ చేశారు.
హర్ ఘర్ తిరంగలో భాగంగా దేశ ప్రజలు ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హర్ ఘర్ తిరంగ క్యాంపెయిన్‌లో భాగంగా హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లోని శానిటరీ, హార్టికల్చరల్ సిబ్బంది తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ జాతీయ జెండాలు, దుస్తులు పంపిణీ చేశారు. వరద సహాయక సామాగ్రి కూడా అందజేశారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను స్వీకరించిన తర్వాత.. వారు ‘‘భారత్ మాతా కీ జై’’ అంటూ తన దేశభక్తిని చాటుకున్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని కోరారు. 75వ స్వాత్వంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలన్నారు. బ్రెస్ట్ ఫీడింగ్ పై ప్రతి తల్లికి అవగాహన అవసరమన్నారు. ఈ విషయంలో వైద్యులు తల్లులకు అవగాహన కల్పించాలని సూచించారు.
Scroll to load tweet…
