ఎన్నికలు ముగిసిన తర్వాత కొలువుదీరిన తెలంగాణ శాసనసభలోని ఉభయసభలనుద్దేశించి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహాన్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ పాల్గొన్నారు. ముందుగా ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలకు ఆయన అభినందనలు తెలిపారు. పదవీకాలంల దిగ్విజయంగా సాగాలని, అంకితభావంతో పనిచేసి ప్రజాసేవలో నిమగ్నం కావాలని గవర్నర్ సభ్యులకు సూచించారు. 

గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

* 28 వేల మెగావాట్ల కొత్త విద్యుత్ ప్రాజెక్ట్‌ల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.

* 1080 మెగావాట్ల సామర్ధ్యంతో నిర్మిస్తున్న భద్రాద్రి పవర్ ప్లాంట్‌ నుంచి విద్యుదోత్పత్తిని ఈ ఏడాది నుంచి ప్రారంభిస్తాం.

* ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి.

* ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అనేక రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా పురోగమిస్తోంది.

* గొల్ల కురుమలకు 75 లక్షల గొర్రెలను పంపిణీ చేశాం

* భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియతో పాటు, భూరికార్డులను ప్రక్షాళన చేశాం.

* చేనేత కార్మికులకు ఏడాది పొడవునా పని కల్పించే చర్యలు చేపట్టాం.

* మత్స్యకారులకు చేప పిల్లలను పంపిణీ చేసి వారి అభివృద్ధికి బాటలు పరిచాం.

* రూ.1000 కోట్లతో ఎంబీసీ కార్పోరేషన్‌ను ఏర్పాటు చేశాం.

* కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పనుల్ని దేశంలోని ఇంజినీర్లు సందర్శించి అద్భుతమన్నారు.

* విద్యుత్ రంగంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉంది.

* లోటు విద్యుత్ స్థాయి నుంచి మిగులు విద్యుత్ దిశగా అడుగులు వేశాం.

* దేశంలో కర్ణాటక తర్వాత సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాం.

* ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 20,171 చెరువులను పునరుద్ధరించాం.

* రైతు సమన్వయ సమితి సభ్యులకు గౌరవ భృతి ఇస్తాం.

* రికార్డు స్థాయిలో 42 నెలల్లోనే కేటీపీఎస్ పవర్‌ప్లాంట్‌ను నిర్మించాం

* సంక్షేమ పథకాల్లో తెలంగాణ దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచింది.

* బీసీల అభ్యున్నతి కోసం మెరుగైన పథకాలను తీసుకొచ్చాం.

* 542 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశాం

* ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించి వైద్యం అందిస్తున్నాం. 

* హైదరాబాద్‌ బస్తీల్లో దవాఖానాలను ఏర్పాటు చేసి పేదలకు వైద్యం అందిస్తున్నాం

*  రాష్ట్రానికి కొత్తగా 4 మెడికల్ కళాశాలలు మంజూరయ్యాయి.

* కంటివెలుగు పథకం ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపాం.

* త్వరలో రాష్ట్రప్రజలకు దంత, ముక్కు, చెవి, గొంతు పరీక్షలను నిర్వహిస్తాం.

* 1326 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాం

* 3 వేల పంచాయతీల్లో ఎస్టీలే సర్పంచ్‌లు కాబోతున్నారు.

* శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం రాజీపడే ప్రసక్తే లేదు

* కొత్త జోనల్ వ్యవస్థను తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాల్ని తీసుకొచ్చాం

* రాబోయే కాలంలో రూ. లక్షా 17 వేల కోట్ల విలువ చేసే పనులు పూర్తి చేస్తాం.

* గత నాలుగున్నరేళ్లలో నీటిపారుదల రంగంలో రూ.77 వేల 777 కోట్లు ఖర్చు చేశాం.

* చెరువుల పునరుద్దరణ కోసం చేపట్టిన మిషన్ కాకతీయ సత్పలితాలను ఇచ్చింది

* కాళేశ్వరం ప్రాజెక్ట్ దేశానికే ఆదర్శంగా నిలిచింది.

* వృద్ధిరేటులో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉంది.

* రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నాం.

* ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది.

* పేద వర్గాల కోసం ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మీ దేశానికే ఆదర్శం.

* వచ్చే మార్చి నాటికి మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికి మంచినీరు ఇస్తాం.

* మిషన్ కాకతీయ ప్రాజెక్ట్ వల్ల భూగర్భ జలాలు పెరిగాయి.

* కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు భారీ ప్రాజెక్టుల నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టింది

* పరిశ్రమలు, ఐటీ రంగ విస్తరణ ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టాం.

* కుదేలైన కులవృత్తులను పునరుద్దరించి గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను పరిపుష్టం చేశాం.

*  కరెంట్ కోతలు లేకుండా రాష్ట్రం మొత్తం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం.

* సమైక్యపాలనలో వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశారు.

* రైతు బంధు పథకానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దేశంలోని చాలా రాష్ట్రాలు ఈ పథకాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నాయి.