కేసిఆర్ పేరు మార్చిన గవర్నర్ నరసింహన్

కేసిఆర్ పేరు మార్చిన గవర్నర్ నరసింహన్

తెలంగాణ సిఎం కేసిఆర్ పేరు అందరికీ తెలిసిందే. ఆయన పేరు చంద్రశేఖరరావు, ఆయన ఇంటిపేరు కల్వకుంట్ల అని తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని అడిగినా చెబుతారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని పెద్ద పేరు పిలవకుండా అందరు కేసిఆర్ అంటారు. కేసిఆర్ అనే పేరు విశ్వ వ్యాప్తమైంది. అయితే ఇప్పుడు గవర్నర్ నర్సింహ్మన్ కేసిఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదని కొత్త పేరును వెల్లడించారు. అదేంటో చదవండి.

గవర్నర్ నరసింహన్ దంపతులు కాలేశ్వరం ప్రాజెక్టును విజిట్ చేశారు. హెలిక్యాప్టర్ లో కాలేశ్వరం పనులు ఎట్ల జరుగుతున్నయా అని క్షేత్ర పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా కాలేశ్వరం పనులు మూడు షిప్ట్ లలో జరుగుతున్నాయని ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గవర్నర్ కు వివరించారు.

ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ.. కేసిఆర్ ను పొగడ్తలతో ముంచెత్తారు. కేసిఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనుకుంటారు.. కాదు అన్నారు. దీంతో అక్కడ ఉన్నవారంతా షాక్ అయ్యారు. కేసిఆర్ అంటే కాలేశ్వరం చంద్రశేఖరరావు అని చమత్కరించారు. దీంతో అందరూ నవ్వారు. ఇకనుంచి తాను కాలేశ్వరం చంద్రశేఖరరావు అనే పిలుస్తా అన్నారు.

అలాగే మంత్రి హరీష్ రావు పేరు కూడా మార్చారు గవర్నర్. హరీష్ రావు కాలేశ్వర్ రావుగా చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. హరీష్ రావు తనువంతా కాలేశ్వరమే అని అభినందించారు. మొత్తానికి తెలంగాణ సిఎం కేసిఆర్ పై కాలేశ్వరం ప్రాజెక్టు సందర్శన సందర్భంగా మరోసారి పొగడ్తలతో ముంచెత్తారు గవర్నర్ నరసింహన్

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos