Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో రిజిస్ట్రేష‌న్ స్లాట్ బుకింగ్ నిలిపివేత‌..! స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం..

రాష్ట్ర హైకోర్టు ఆదేశాల నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. తెలంగాణలో రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్‌ను నిలిపివేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. కాకపోతే, ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్నవారికి య‌థావిథిగా రిజిస్ట్రేషన్ల సర్వీసులు అందించ‌నున్న‌ట్టు ఈ ఉత్త‌ర్వుల్లో పేర్కొంది.

government suspends land registration slot booking system in telangana - bsb
Author
Hyderabad, First Published Dec 19, 2020, 1:57 PM IST

రాష్ట్ర హైకోర్టు ఆదేశాల నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. తెలంగాణలో రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్‌ను నిలిపివేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. కాకపోతే, ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్నవారికి య‌థావిథిగా రిజిస్ట్రేషన్ల సర్వీసులు అందించ‌నున్న‌ట్టు ఈ ఉత్త‌ర్వుల్లో పేర్కొంది.

స్లాట్ బుకింగ్ అయిన వారికి యథాతథంగా రిజిస్ట్రేషన్ సర్వీసులు కొన‌సాగుతాయ‌ని, కానీ, కొత్త‌గా స్లాట్ బుకింగ్ ఉండ‌ద‌ని తెలంగాణ ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే.

 దీనిలో స్లాట్ బుకింగ్ విధానంలోనే రిజిస్ట్రేష‌న్లు చేస్తున్నారు. ఈ పోర్టల్ లో వ్య‌వ‌సాయ భూములు రిజిస్ట్రేష‌న్ కొన‌సాగుతుంది. అయితే  వ్య‌వ‌సాయేత‌ర ఆస్తుల రిజిస్ట్రేష‌న్‌లోనే ఎక్కువ స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. దీంతో హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. 

కాగా, యూజర్‌ మాన్యువల్‌లో ఆధార్‌కు సంబంధించిన ప్రస్తావనను తొలగించే వరకు స్లాట్‌ బుకింగ్‌, ఆస్తిపన్ను నెంబరు (పీటీఐఎన్‌) కోరే వారిని ఆధార్‌ సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం పట్టుబట్టరాదు. రిజిస్ట్రేషన్‌ మాత్రం కొనసాగించవచ్చు అని హైకోర్టు ఆదేశించిన సంగ‌తి తెలిసిందే.

రిజిస్ట్రేషన్‌ సమయంలోనూ ఆధార్‌ నెంబరు ఇవ్వాలని రిజిస్ట్రేషన్‌ చేసే అధికారి పట్టుబట్టరాదని, రిజిస్ట్రేషన్‌ సమయంలో ఒక వ్యక్తిని గుర్తించడానికి మరేదైనా అధికారిక పత్రాన్ని ప్రామాణికంగా తీసుకోవచ్చు అని సూచించింది.

కుటుంబ సభ్యుల పేర్లు, వారి ఆధార్‌ నంబర్లు, కులం, సామాజిక హోదా వివరాలను కోరే కాలమ్స్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం తొలగించాల‌ని.. కుటుంబ సభ్యుల ఆధార్‌ వివరాలు, కుల సమాచారం అడగబోమని రాష్ట్ర ప్రభుత్వమే అండర్‌టేకింగ్‌ ఇచ్చినందున‌.. అందుకే స్లాట్‌ బుకింగ్‌కు ఈ వివరాలను కోరే ప్రస్తావనను యూజర్‌ మాన్యువల్‌ నుంచి తొలగించాల‌ని స్ప‌ష్టం చేసింది. 

ఓవైపు.. ఈ విధానంపై కేసీఆర్ ఉన్న‌త‌స్థాయి స‌మీక్ష‌కు సిద్ధ‌మ‌వుతున్న స‌మ‌యంలోనే ప్ర‌భుత్వం కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది.


 

Follow Us:
Download App:
  • android
  • ios