Asianet News TeluguAsianet News Telugu

బ్లాక్ ఫంగస్ తో నిజామాబాద్ లో లెక్చరర్ మృతి...

తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్ల బోధన్ లో బ్లాక్ ఫంగస్ కలకలం రేపింది. బ్లాక ఫంగస్ తో చికిత్స పొందుతున్న గవర్నమెంట్ లెక్చరర్ ఒకరు మృతి చెందారు. దీంతో రెంజల్ మండలం నీలా గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. 

government college lecturer died with black fungus in nizamabad - bsb
Author
Hyderabad, First Published Jun 5, 2021, 9:41 AM IST

తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్ల బోధన్ లో బ్లాక్ ఫంగస్ కలకలం రేపింది. బ్లాక ఫంగస్ తో చికిత్స పొందుతున్న గవర్నమెంట్ లెక్చరర్ ఒకరు మృతి చెందారు. దీంతో రెంజల్ మండలం నీలా గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. 

కరోనా నుంచి కోలుకున్నవారే ఎక్కువగా దీని బారిన పడుతుండడంతో చాలామందిలో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకుంటే బ్లాక్ ఫంగస్ నుంచి కోలుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే, తెలంగాణలో కరోనా కేసుల తగ్గుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,36,096 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 2,175  పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. తెలంగాణలో నిన్న కరోనాతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు... వీటితో కలిపి కోవిడ్‌తో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,346కి చేరింది. వైరస్ బారి నుంచి నిన్న 3,821 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 30,918 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. రాష్ట్రంలో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 253 కేసులు నమోదయ్యాయి.   

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 8, భద్రాద్రి కొత్తగూడెం 110, జీహెచ్ఎంసీ 253, జగిత్యాల 59, జనగామ  40, జయశంకర్ భూపాలపల్లి 71, గద్వాల 28, కామారెడ్డి 9, కరీంనగర్ 113, ఖమ్మం 144, మహబూబ్‌నగర్ 75, ఆసిఫాబాద్ 11, మహబూబాబాద్ 73, మంచిర్యాల 72, మెదక్ 21, మేడ్చల్ మల్కాజిగిరి 81, ములుగు 59, నాగర్ కర్నూల్ 31, నల్గగొండ 178, నారాయణపేట 12, నిర్మల్ 5, నిజామాబాద్ 29, పెద్దపల్లి 87, సిరిసిల్ల 63, రంగారెడ్డి 101, సిద్దిపేట 81, సంగారెడ్డి 95, సూర్యాపేట 80, వికారాబాద్ 51, వనపర్తి 39, వరంగల్ రూరల్ 33, వరంగల్ అర్బన్ 69, యాదాద్రి భువనగిరిలో 54 చొప్పున కేసులు నమోదయ్యాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios