అటవీ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు భార్యకు డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇచ్చింది కేసీఆర్ సర్కార్.
హైదరాబాద్ : విధి నిర్వహణలో భాగంగా అటవీ సంపదను కాపాడబోయి ఎఫ్ఆర్వో శ్రీనావాసరావు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు హరిత దినోత్సవం నిర్వహించిన కేసీఆర్ సర్కార్ శ్రీనివాసరావు కుటుంబాన్ని ఆదుకుంది. శ్రీనివాసరావు భార్య భాగ్యలక్ష్మికి డిప్యూటీ తహసీల్దార్ గా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే భాగ్యలక్ష్మికి నియామకపత్రం అందజేసారు.
వీడియో
ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ... పెద్దదిక్కును కోల్పోయిన తమ కుటుంబానికి పెద్దగా, తండ్రిగా మారిన సీఎం కేసీఆర్ అండగా నిలిచారని అన్నారు. ఇప్పటికే ఇంటి స్థలం, ఆర్థిక సహాయం అందించిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఉద్యోగం ఇచ్చారన్నారు. తమను ఆదుకున్న ముఖ్యమంత్రికి కుటుంబం తరపున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని భాగ్యలక్ష్మి అన్నారు.
