కారణమిదీ:హరీష్‌రావుతో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భేటీ
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ శుక్రవారంనాడు మంత్రి హరీష్ రావుతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై మంత్రి హరీష్ రావుతో చర్చించినట్టుగా రాజాసింగ్ చెబుతున్నారు.
హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ శుక్రవారంనాడు తెలంగాణ మంత్రి హరీష్ రావుతో భేటీ అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి పనుల విషయమై మంత్రి హరీష్ రావును కలిసినట్టుగా రాజాసింగ్ చెబుతున్నారు. అయితే ఈ భేటీ ప్రాధాన్యత చోటు చేసుకుంది.గోషామహల్ అసెంబ్లీ స్థానం నుండి రాజాసింగ్ వరుసగా విజయం సాధిస్తున్నారు. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందున రాజాసింగ్ పై బీజేపీ నాయకత్వం సస్పెన్షన్ వేటేసింది.