Asianet News TeluguAsianet News Telugu

5 నిమిషాలు చాలు.. గుడ్డలూడదీసి కొడతా: కేసీఆర్ సర్కార్‌పై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ నేత, గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో 5 నిమిషాలు సమయం ఇస్తే ప్రభుత్వం గుడ్డలూడదీసి కొడతానని హెచ్చరించారు. ఇది బంగారు తెలంగాణ కాదని.. మన మత్తు తెలంగాణ అంటూ రాజాసింగ్ వ్యాఖ్యానించారు. 
 

goshamahal bjp mla raja singh sensational comments on kcr govt
Author
Hyderabad, First Published Sep 23, 2021, 6:44 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గురువారం ఆయన మాట్లాడుతూ.. తాము సిరిసిల్లలో ఇసుక దందా చేయడం లేదంటూ ఎద్దేవా చేశారు. సిరిసిల్ల జిల్లా కోసం కేటీఆర్ ఏం  చేశారో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రతి అభివృద్ధి పనిలో కేంద్రం పైసలే ఖర్చు చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో సన్న బియ్యం పండించిన రైతుల పరిస్ధితి ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ ఆర్టీసీని అమ్మేసి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారని... పేదోళ్ల ప్రభుత్వం రావాలంటే 2023లో బీజేపీని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలో కుటుంబ పాలన అంతం చేయాలని బండి సంజయ్ అన్నారు. 

గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో 5 నిమిషాలు సమయం ఇస్తే ప్రభుత్వం గుడ్డలూడదీసి కొడతానని హెచ్చరించారు. ఇది బంగారు తెలంగాణ కాదని.. మన మత్తు తెలంగాణ అంటూ రాజాసింగ్ వ్యాఖ్యానించారు. తెలంగాణను సీఎం కేసీఆర్ ల్యాండ్, డ్రగ్స్, వైన్స్, శాండ్ మాఫియాగా మార్చారని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios