జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా బీజేపీలోని అసంతృప్తులు ఒక్కొక్కటిగా భయటపడుతున్నాయి. తాజాగా ఆదివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గోషామహాల్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

కుర్చీలు విసిరేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే రాజాసింగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గన్‌ఫౌండ్రీకి చెందిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

శైలేందర్ , ఓం ప్రకాశ్ వర్గీయులు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బీ ఫార్మ్ తీసుకునేందుకు ఓం ప్రకాశ్ రావడంతో శైలేందర్ యాదవ్ వర్గీయులు అడ్డుకున్నారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఓం ప్రకాశ్‌కు టిక్కెట్ ఎలా ఇస్తారని ఆందోళనకు దిగారు.